మ‌ళ్లీ మొద‌టి నుంచి దిల్లీ పంజాబ్ మ్యాచ్ !

మ‌ళ్లీ మొద‌టి నుంచి దిల్లీ పంజాబ్ మ్యాచ్ !

భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌ను మే 17 నుంచి తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. లీగ్‌ మ్యాచ్‌లు బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్, ముంబయి వేదికలపై జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ జూన్ 3న జరుగనుంది. ప్లే ఆఫ్స్ వేదికల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

ఇక మే 8న ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్ (PBKS) vs ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్‌ను భద్రతా కారణాల వల్ల 10.1 ఓవర్ల ఆట తర్వాత అర్ధాంతరంగా రద్దు చేశారు. సాధారణంగా మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అయితే, ఈ మ్యాచ్‌లో పాయింట్లు కేటాయించకపోవడంతో అభిమానులు అయోమయంలో పడ్డారు.

ఇప్పుడు బీసీసీఐ విడుదల చేసిన కొత్త షెడ్యూల్ ప్రకారం, ఈ మ్యాచ్‌ను మే 24న జైపూర్‌లో పూర్తి మ్యాచ్‌గా మళ్లీ నిర్వహించనున్నారు. అంటే, ధర్మశాలలో జరిగిన ఆటను పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా ప్రారంభిస్తారు. ఈ నిర్ణయం పంజాబ్‌కు కొంత నష్టం కలిగించవచ్చు, ఎందుకంటే ఆ జట్టు అప్పటికే 10.1 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి 122 పరుగులు చేసింది.

ప్రస్తుతం పంజాబ్ 11 మ్యాచ్‌లు ఆడి 15 పాయింట్లతో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఒకదాంట్లో గెలిస్తే, ప్లే ఆఫ్స్‌కి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ప్రకారం:

  • ఏప్రిల్ 29: క్వాలిఫయర్-1

  • ఏప్రిల్ 30: ఎలిమినేటర్

  • జూన్ 1: క్వాలిఫయర్-2

  • జూన్ 3: ఫైనల్

ఇవన్నీ ఎక్కడ జరుగుతాయన్నదానిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే, ముంబయిలో ప్లే ఆఫ్స్, అహ్మదాబాద్‌లో ఫైనల్ నిర్వహించే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రతి వారం 250 పాడి పశువుల యూనిట్ల గ్రౌండింగ్.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
*జులై 15 తర్వాత పాడి పశువుల కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలి *ప్రతి పాడి పశువుకు ఆర్.ఎఫ్.ఐ.డి. ట్యాగింగ్ కల్పించాలి *ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణపై సమీక్షించిన జిల్లా...
ఎస్.బి.ఐ. బ్యాంకు  ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
మ‌ళ్లీ మొద‌టి నుంచి దిల్లీ పంజాబ్ మ్యాచ్ !
గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రదేశం డ్రోన్ దృశ్యాలు.
క్రేజీ కాంబోలో సినిమా... 
పగడ్బందీగా ధాన్యం సేకరణ