దేశమే మా ధ్యేయం

దేశమే మా ధ్యేయం
-----------------------------------------
ఓ యువత మేలుకో 
ఓ యువత గర్జించు
యువ శక్తిని రగిలించు
సమర శంఖం పూరించు 
యువ సత్తను చూపించు 
దేశద్రోహులను శిక్షించు
దేశ ఖ్యాతిని గెలిపించు... 

ఈ దేశంలో జన్మించి 
ఈ భరత గడ్డమీద పెరిగి
ఈ దేశపు గాలి పీల్చుతూ
ఇక్కడే విజ్ఞానాన్ని పొంది
దేశద్రోహుల అంతమే లక్ష్యంగా
మేలుకో ఓ యువత...

ఉన్మాదంతో రాక్షసత్వంగా 
మనుషులను చంపుతూ
రాక్షస ఆనందం పొందిరి 
ఈ ఉన్మాదపు ముష్కరులు 
కూర మృగాల విజృంభిస్తూ
రక్తపాతం,విధ్వంసంతో
చిచ్చు వెట్టిన రక్త పిశాచుల 
అంతమే లక్ష్యంగా ఆలోచించు.. 

ధర్మ రక్షణే ధ్యేయం
జాతి గౌరవమే లక్ష్యంగా
శివతాండవం తప్పదిక 
కంకణ బద్ధుడవై కదలాలిక
చత్రపతి వై గర్జించాలి
భరతమాత నుదుటిపై 
రక్త తిలకం దిద్దుడకై సిద్ధమౌ 
సమర శంఖం పూరించు
సైనికుడిలా యుద్ధానికి సిద్ధమౌ 
విశ్వ విజేతగా దేశాన్ని నిలబెట్టు

 వి.జానకి రాములు గౌడ్

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇసుక క్వారీని రద్దు చేయాలని  బిజెపి ధర్నా ఇసుక క్వారీని రద్దు చేయాలని  బిజెపి ధర్నా
లోకల్ గైడ్మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి దుందుభి వాగు నుండి ఇసుక తరలింపుకు అనుమతులు రద్దుచేసి ఇసుక కోరిని ఆపాలని మిడ్జిల్ మండల బిజెపి నాయకులు బుధవారం స్థానిక...
రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌గారితో మ‌ర్యాద‌పూర్వ‌కంగా 
నూతన కమిషనర్లుగా నియమితులైన వారితో ప్రమాణం 
అసంఘటిత కార్మికుల కనీసం పది రోజుల పని దినాలు కల్పించాలి
చెరువుగట్టు పై అద్భుతమైన పాట పాడిన సింగర్ & యాంకర్ మంజుల యాదవ్ #singermanjulayadav #shorts #lgmedia
 పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవడం ఇప్పుడు మరింత ఈజీ.. జస్ట్‌ మిస్డ్‌కాల్‌ ఇస్తే చాలు!
స‌రిహ‌ద్దు గ్రామాల ప్ర‌జ‌లు జంకుతున్నారు...ఎందుకో తెలుసా