పెరుగులో ఇది కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా .......
లోకల్ గైడ్ :
పెరుగులో చక్కెర కలిపి తింటే జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. ఇది కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది. అయితే పెరుగులో పంచదార ఎక్కువగా తినడం వల్ల బరువును వేగంగా పెరిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే చక్కరలో కేలరీస్ ఎక్కువ. ఇది కాకుండా, డయాబెటిక్ రోగులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది మంచిదికాదు. కాబట్టి ఉప్పు కలుపుకొని పెరుగుతినడం వల్ల కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని నష్టాలూ ఉన్నాయి. చక్కెర పెరుగులో కలిపి తీసుకుంటే కొన్ని లాభాలు ఇంకొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. మరి పెరుగు ఎలా తింటే ప్రయోజనకరం..?
పెరుగులో కొద్ది మొత్తంలో ఉప్పు లేదా పంచదార కలిపి తినడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి హాని ఉండదు. కానీ మధుమేహం, రక్తపోటు లేదా ఊబకాయంతో బాధపడుతున్నవాళ్ళయితే, దానిని తీసుకునేటప్పుడు కొన్ని దుష్ప్రభావాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అసలు అటువంటి పరిస్థితుల్లో ఉప్పు, పంచదార కలపకుండా పెరుగు తినడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
Comment List