పెద్దిలో రామ్ చ‌ర‌ణ్‌తో స్టెప్పులేసేది ఎవ‌రో తెలుసా?

 పెద్దిలో రామ్ చ‌ర‌ణ్‌తో స్టెప్పులేసేది ఎవ‌రో తెలుసా?

లోక‌ల్ గైడ్:
 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చివరిసారిగా "గేమ్ ఛేంజర్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు మాత్రం "పెద్ది" అనే చిత్రంతో అభిమానులకు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు సిద్ధమవుతున్నారు చెర్రీ. ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు.లండన్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ ఇప్పటివరకు సినిమా షూటింగ్ సుమారు 30% పూర్తైందని తెలిపారు. అంతేగాక, "రంగస్థలం" కన్నా "పెద్ది" మరింత భారీగా ఉండబోతుందని చెప్పి సినిమా పట్ల అంచనాలను పెంచారు.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, శివ రాజ్‌కుమార్, దివ్యేందు వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి వెంకట సతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇటీవ‌ల విడుదలైన గ్లింప్స్ వీడియో సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చింది. ఈ వీడియోలో చరణ్ మాస్ లుక్ అందరినీ ఆకట్టుకోగా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడతామా ఏంటి మళ్లీ" అంటూ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పిన డైలాగ్స్‌కి అభిమానులు ఫిదా అయ్యారు. చివర్లో చరణ్ కొట్టిన సిక్స్ షాట్ అభిమానులను తెగ ఆకట్టుకుంది.వచ్చే ఏడాది మార్చి 27న ఈ చిత్రం విడుదల కానుంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ ఆట కూలీగా కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉండనుందని తెలుస్తోంది. ఇందులో పూజా హెగ్డే రామ్ చరణ్‌తో కలిసి డాన్స్ చేయనున్నట్లు తాజా సమాచారం. ఇప్పటికే శ్రీలీల ఈ పాటలో నటిస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు పూజానే ఫిక్స్ అయినట్లు టాక్. "రంగస్థలంలో" జిగేలు రాణిగా అలరించిన పూజా, ఇప్పుడు "పెద్ది"లో మరోసారి రచ్చ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News