ఆర్ఆర్ఆర్ 2 చేస్తారా?
లోకల్ గైడ్ :
లండన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ హల్చల్ చేసింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి కలిసి రాయల్ ఆల్బర్ట్ హాల్లో జరిగిన ప్రత్యేక స్క్రీనింగ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన ఓ భారీ ఆర్కెస్ట్రా ప్రదర్శన కూడా జరిగింది. నాటు నాటు పాట ప్లే అవుతున్న సమయంలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ఉత్సాహంగా కనిపించారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి రాజమౌళిని సరదాగా ఆట పట్టించారు. ముగ్గురు కలిసి నవ్వుతూ సందడి చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్ సతీమణి ఉపాసన మరియు ఎన్టీఆర్ భార్య ప్రణతి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంలో ఉపాసన, రాజమౌళిని ‘ఆర్ఆర్ఆర్ 2’ చేస్తారా? అని అడగగా, ఆయన “అవును” అని సమాధానం ఇచ్చారు. దానికి ఉపాసన "గాడ్ బ్లెస్ యూ" అంటూ స్పందించారు. ఈ సరదా క్షణాల వీడియోను ఉపాసన సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా, అది నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే చిత్రం చేస్తున్నారు, ఇది 2026 జూన్ 25న విడుదల కానుంది. రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నారు. రాజమౌళి, మహేశ్‌బాబుతో కలిసి ‘ఎస్ఎస్ఎంబీ 29’ అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది వారి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం.
Comment List