ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలి

- జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలి

లోకల్ గైడ్ : గద్వాల,
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులకు ఆదేశించారు. సోమవారం ఇటిక్యాల మండలం గోపాల్ దిన్నె  గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులను, క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఇండ్ల నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయని లబ్ధిదారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులతో మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వం అందజేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని ఇండ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలకు విడతల వారిగా 5 లక్షల రూపాయలను అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిధులు  అందిస్తున్నందున లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని అన్నారు.  నిర్మాణపు పనులను వేగవంతంగా పూర్తి అయ్యేవిధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాల్సిందిగా పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణ విధానాన్ని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో 55 బేస్‌మెంట్ దశలో, 8 ఇండ్లు ఇప్పటికే పూర్తయ్యాయని ముగ్గురు లబ్ధిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయల నిధులు విడుదలయ్యాయని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ యాప్ లో నమోదు చేస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ‌ ద‌శ‌ల‌ను బ‌ట్టి దశల వారీగా ల‌బ్దిదారుల‌కు వారి ఖాతాలోనే నేరుగా డ‌బ్బుల‌ను జమ చేయడం జరుగుతుందని అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అజార్ మోహినుద్దీన్, హౌసింగ్ పీ.డి శ్రీనివాసులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
వికారాబాద్ : లోకల్ గైడ్ : వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోపాల్ గారి ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డి గారి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం...
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత ఆక్రందన? 
ప్రమాదవశాత్తు గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం
హుషారుగా స్టెప్పులేసిన సమంత..
నీట్ (యూ జి) ప్రవేశ పరీక్ష జిల్లాలో ప్రశాంతం.
నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి