సామ్రాజ్యవాద శక్తుల చేతిలో మగ్గుతున్న శ్రామికవర్గాన్ని రక్షించేది 'ఎర్ర జెండానే'

సామ్రాజ్యవాద శక్తుల చేతిలో మగ్గుతున్న శ్రామికవర్గాన్ని రక్షించేది 'ఎర్ర జెండానే'

ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ 'మేడే' 

చికాగో అమరవీరుల స్పూర్తితో కార్మిక, కర్షకులు రాజ్యాధికారంకోసం పోరాడాలి

కమ్యూనిస్టులు బలపడితేనే పేదవర్గాలకు న్యాయం 

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెంలో రెపరెపలాడిన 'అరుణ పతాకం'

సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు

అరుణమయమైన కొత్తగూడెం పురవీధుల

283 కేంద్రాల్లో ఎగిరిన ఎర్రజెండా

 కొత్తగూడెం; నియోజకవర్గ పరిధిలోని కార్మిక క్షేత్రాలు, కార్మిక వాడలు, ఉద్యోగ క్షేత్రాలు, బస్తీలు, గ్రామాల్లో ఎర్రజెండా రెపరెపలాడింది. సిపిఐ, అనుబంధ ప్రజాసంఘాలు, ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల  ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా 283 కేంద్రాల్లో మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయాలు, విద్యానగర్ బైపాస్ రోడ్డు, గ్రామపంచాయతి కార్యాలయం, ఆటో, హమాలీ, సింగరేణి ప్రధాన కార్యాలయం, రైతుబజార్, భవన నిర్మాణ కార్మికుల అడ్డా తదితర ప్రధాన సెంటర్లలో సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు మేడే జెండాను ఆవిష్కరించారు, చికాగో అమరవీరులకు నివాలులర్పించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సభల్లో కూనంనేని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ మేడే అని అన్నారు. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పనివిధానంకోసం జరిగిన సమ్మె సందర్భంగా పాలకులు, యాజమాన్యం జరిపిన కాల్పుల్లో మరణించిన కార్మికుల రక్తంతో తడిసిందే ఈ ఎర్రజెండాఅని పేర్కొన్నారు. వారి అమరత్వంతోనే ఎనిమిది గంటల పనివిధానంతోపాటు అనేక కార్మిక చట్టాలు, హక్కులు ఏర్పడ్డాయని, చికాగో అమరుల స్పూర్తితో భారతదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఉద్యమాలకు ఏలికలు దిగిరాక తప్పలేదన్నారు. బ్రిటీష్ రాజ్యంలో, ఆ తర్వాత స్వతంత్ర భారతంలో పోరాడి, త్యాగాలు చేసి సాధించుకున్న కార్మికుల హక్కులను ఏకమొత్తంగా బిజెపి ప్రభుత్వం రద్దు చేసే కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. చట్టసభల్లో ఉన్న మందబలంతో కార్మిక, ఉద్యోగ, ప్రజా, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని, లాభాల్లో నడుస్తున్న సింగరేణి గనులు, రవాణా, టెలికాం, రైల్వే, బ్యాంకులు, ఎలసి, రక్షణ రంగం, ఇస్రో లాంటి తదితర ప్రభుత్వరంగ సంస్థలను కూడా ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు అప్పణంగా కట్టబెట్టిందని విమర్శించారు. ప్రజల కోసం కాకుండా ఆర్ధిక బకాసురులకు, ఆర్ధిక నేరగాళ్ళగా మోడీ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బంగడుకుంటుందేతప్ప దేశ ప్రజలకు మోడీ ప్రభుత్వం చేసింది శూన్యమని అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేలా బిజెపి వ్యవహరిస్తోందని, దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, సామ్రాజ్యవాద శక్తుల చేతిలో మగ్గుతున్న శ్రమకవర్గాన్ని రక్షించేది ఎర్ర జెండానేని అన్నారు. 139వ మేడే స్పూర్తితో ప్రజాస్వామ్య రక్షణ, కార్మిక హక్కులు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం కమ్యూనిస్టు పార్టీ నిర్వహించే పోరాటాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గరాసి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, కంచర్ల జమలయ్య, జి వీరాస్వామి, జి నగేష్, కందుల భాస్కర్, భూక్యా శ్రీనివాస్, రత్నకుమారి, పొలమూరి శ్రీనివాస్, దీటి లక్ష్మీపతి, బానోత్ గోవిందు, వంగ వెంకట్, అహీమ్, రమణమూర్తి, నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు, మాచర్ల శ్రీనివాస్, పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, ధర్మరాజు, యూసుఫ్, నేరెళ్ల శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, లక్ష్మి, ధనలక్ష్మి, భాగ్యలక్ష్మి, షాహీన్, బత్తుల సత్యనారాయణ, నేరెళ్ల రమేష్, ఆరెల్లి కృష్ణ, అబ్బులు, జహీర్, విజయలక్ష్మి, సప్పిడి కోటేశ్వరరావు, షమీమ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్  ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్
'పది'ఫలితాలలో త్రివేణి విజయభేరి 
సామ్రాజ్యవాద శక్తుల చేతిలో మగ్గుతున్న శ్రామికవర్గాన్ని రక్షించేది 'ఎర్ర జెండానే'
పని గంటలను పెంచనివ్వం: - సీఐటీయూ
శివాలయం పునర్ నిర్మాణానికి 75వేల విరాళం అందజేసిన బండ్ల రాజశేఖర్ రెడ్డి
జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అక్షయ తృతీయ నాడు ఒడిశా 51 లక్షల మంది రైతుల ఖాతాకు ₹1025 కోట్లు బదిలీ 
మారుమూల ఆదివాసి గ్రామాల్లో  మెరుగైన వైద్యం సౌకర్యవంతంగా చూడాలి.