ఎక్లాస్ ఖాన్ పేట ప్రజలకు అండగా ఉంటాం 

కక్ష్యలు..దుర్మార్గాలు.. దౌర్జన్యాలు  చేయం..! 

ఎక్లాస్ ఖాన్ పేట ప్రజలకు అండగా ఉంటాం 

షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్" 

 ఎక్లాస్ ఖాన్ పేటలో కాంగ్రెస్ హంగామా 

 ఎమ్మెల్యే శంకర్ పై పూల వర్షం కురిపించిన గ్రామస్తులు కార్యకర్తలు 

 37 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు - శంకుస్థాపన కార్యక్రమాలు 

 అడుగడుగున పూల వర్షం - ఆటపాటలతో కాంగ్రెస్ జోరు 

 చికుబుకు చికుబుకు రైలే - అదిరెను "శంకర్" స్టైలే..

షాద్ నగర్ నియోజకవర్గంలో ఇలాంటి రాజకీయాలు, కక్షలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు చేయమని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుందని వారి యోగక్షేమాలు చూస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం కేశంపేట మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో మంజూరైన 37 ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే శంకర్ తదితర శ్రేణులకు భారీ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే శంకర్ ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో ఉన్నంత సేపు ఆయనపై అభిమానులు పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా అట్టహాసంగా గ్రామస్తులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ళకు ముగ్గులు పోసి పునాదులు తీశారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. ఇలాంటి కక్షలు దుర్మార్గాలు దౌర్జన్యాలకు పాల్పడనని ప్రజలకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని గత పాలకులు గ్రామంలో ఏమేం చేశారు ఎన్ని దౌర్జన్యాలు చేశారు అందరికీ తెలుసని వారి పేర్లు తీయదలుచుకోలేదని మీడియా ముఖంగా శంకర్ అన్నారు. ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యతను నేను సక్రమంగా నెరవేర్చుతానని భరోసా ఇచ్చారు. గ్రామానికి చెందిన వై యాదయ్య యాదవ్ ఇంకా పలువురు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులకు ఎల్లవేళలా అండగా నిలుస్తారని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం జరుగుతుందో గ్రామాల్లో నిరూపిస్తున్నామని శంకర్ అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పేదలకు ఇండ్లు సమకూరలేదని కాలయాపన చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు తప్ప సక్రమంగా పాలించలేదని ధ్వజమెత్తారు. నేడు గ్రామాలు పండగ వాతావరణాన్ని సంతరించుకున్నాయని ఉచిత బస్సు సిలిండర్ కరెంటు తోపాటు సన్నబియ్యాన్ని ప్రజలకు ఇచ్చి ప్రభుత్వం ఎంతో మేలు చేసిందని చెప్పుకొచ్చారు.

 చికుబుకు చికుబుకు రైలే - అదిరెను "శంకర్" స్టైలే..

చికుబుకు చికుబుకు రైలే అదిరెను శంకర్ స్టైలే అన్నట్లు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎక్లాస్ ఖాన్ పేట గ్రామంలో రేబాన్ కళ్ళజోడు పెట్టి కార్యక్రమాన్ని ఇరగదీశారు. కార్యకర్తలు అభిమానులతో కలిసి స్టెప్పులు వేశారు. గ్రామంలో ప్రవేశించినప్పటి నుండి అభిమానులు కార్యకర్తలు కేరింతలతో ఎమ్మెల్యే పై పూల వర్షం కురిపించారు. గ్రామంలో ఎమ్మెల్యే శంకర్ పెద్ద ఎత్తున సందడి చేశారు. అనేకమంది ముఖ్య నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎక్లాస్ ఖాన్ పేట గ్రామానికి తరలిరావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అడుగడుగున ఎమ్మెల్యే శంకర్ కు పూల వర్షం కురిపించడంతో గ్రామంలో కాంగ్రెస్ హంగామా కొనసాగింది. పోలీసులు కూడా ముందస్తు చర్యగా గ్రామంలో పోలీసులను మోహరించారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వగ్రామం కాబట్టి ఈ కార్యక్రమం విశిష్టతను సంతరించుకుంది.. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు:  ఉపాధ్యాయులే సమాజ నిర్మాతలు: 
నిర్మల్, లోకల్ గైడ్: ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి మూలస్తంభాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. పట్టణంలోని నారాయణ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం నుంచి ప్రారంభమైన ఐదు...
మోడీ ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోతున్న అటవీశాఖ
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ..
ఎన్‌ఈఈటీ-యూజి ఫలితాలపై మధ్యంతర స్టే – మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశం | Local Guide
ముస్తాఫిజుర్ రహ్మాన్‌కు BCB నుంచి NOC – ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊరట | Local Guide
ఇసుక రిచ్ ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే..
మిచెల్ స్టార్క్ IPL 2025 నుంచి వైదొలిగిన విషయం ధృవీకరణ – ఢిల్లీ క్యాపిటల్స్‌కు గట్టి ఎదురుదెబ్బ | లోకల్ గైడ్