క‌రోనా భారీన ప‌డ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్

క‌రోనా భారీన ప‌డ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్

లోక‌ల్ గైడ్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కరోనా వైరస్‌కు గురయ్యాడు. దీనివల్ల సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు ఆయన దూరం కానున్నారు. ఈ విషయాన్ని జట్టు ప్రధాన కోచ్ డేనియల్ వెట్టోరి వెల్లడించారు. కరోనా బారినపడటంతో హెడ్‌ భారత్‌కు రావడంలో ఆలస్యం జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే, ట్రావిస్ హెడ్‌కు కరోనా ఎప్పుడు, ఎక్కడ సోకిందన్న విషయాన్ని మాత్రం కోచ్ వెల్లడించలేదు.వెట్టోరి మీడియాతో మాట్లాడుతూ, హెడ్ సోమవారం ఉదయం భారత్‌కు చేరుకుంటారని, వైద్య పరీక్షల అనంతరం పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కరోనా వల్ల ఆయన ప్రయాణం ఆలస్యమైందని కూడా చెప్పారు.

ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌కు ఒక వారం విరామం ఇచ్చారు. ఈ సమయంలో ట్రావిస్ హెడ్‌, కెప్టెన్ పాట్ కమిన్స్‌ ఇద్దరూ ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. జూన్ 11న జరిగే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు ముందు వీరిద్దరూ మళ్లీ ఐపీఎల్‌లో పాల్గొంటారా అనే అనుమానాలు నెలకొన్నాయి.అయితే మిగిలిన మ్యాచ్‌ల కోసం హెడ్, కమిన్స్ ఇద్దరూ తిరిగి భారత్‌కు వస్తారని సన్‌రైజర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ తరుణంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్‌ రేసు నుండి బయటపడింది. మే 25న తుదిమ్యాచ్ ఆడనుంది. ఇప్పటికీ జట్టుకు మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి — లక్నో, ఆర్‌సీబీ, కేకేఆర్‌తో తలపడనుంది. ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్ 11 మ్యాచ్‌ల్లో కేవలం 281 పరుగులు మాత్రమే సాధించాడు. గత సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 567 పరుగులు చేసిన ఆయన, ఈసారి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 
కరీంనగర్ : లోకల్ గైడ్:వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...
సబ్సిడీ జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 
జాతీయ రక్షణ నిధికి లక్ష రూపాయల విరాళం
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై శ్రద్ధ వహించండి
జీలుగు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి    
గణంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి. 
తొర్రురులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం