సబ్సిడీ జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
- రైతులకు ఏకకాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ
- వరి దాన్యం సన్నలకు రూ 500 బోనస్ ఇస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ రాష్టం
- 30 కిలోల జీలుగు విత్తనాల బ్యాగు 50 శాతం సబ్సిడీ పోను రూ 2138
- రైతుల అభివృద్దే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం
- వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య
వరంగల్ (లోకల్ గైడ్ ): వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో వానకాలం పంటలకు పచ్చిరెట్టేగా ఉపయెగించే జీలుగు విత్తనాలను 50 శాతం సబ్సిడీ తో రైతులకు అందించే కార్యక్రమాన్ని వర్దన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య , వర్దన్నపేట పిఎసిఎస్ చైర్మన్ రాజేష్ కన్నా , కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ వానకాలం 2025 - 26 పంట సీజన్ గాను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పచ్చి రొట్టె ఎరువులుగా ఉపయోగించే జిలుగు విత్తనాలను 50 శాతం సబ్సిడీతో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు సిద్దంగా ఉన్నారని తెలిపారు. పచ్చిరొట్టే ఎరువుగా జీలుగు విత్తనాలు ఉపయోగించడం ద్వారా భూమి సారవంతమవుతుందని, భూమికి నత్రజని ఇతర పోషకాలను అందిస్తాయాన్ని తద్వారా పంట దిగుబడిని కూడా పెంచుతాయి కాబట్టి జీలుగు విత్తనాలు వాడడం ద్వారా భూమి యొక్క ఆరోగ్యం మెరుగుపడి , రసాయనిక ఎరువుల అవసరాన్ని తగ్గిస్తాయి అని తెలిపారు.50% సబ్సిడీ తర్వాత 30 కిలోల బ్యాగు ధర రైతుకు రూ.2138/- అవుతుంది, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. రెండున్నర ఎకరాల వరకూ వరి సాగు చేసే రైతులకు ఒక్క బ్యాగు జీలుగు విత్తనాలు, ఆపైన సాగు చేసే వారికి రెండు బ్యాగులు అందించబడుతాయని తెలిపారు.రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విత్తనాలను సకాలంలో పొందగలరని అన్నారు.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పోషాల వెంకన్న గౌడ్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు గుంటి కుమారస్వామి,గడ్డం సమ్మయ్య, ఇల్లంద టెంపుల్ చైర్మన్ మైదం బుచ్చి మల్లు,సిపిఐ పార్టీ నాయకుడు యాదగిరి,MD యాకూబ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comment List