గణంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి. 

గణంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి. 

మహబూబాబాద్  (లోకల్ గైడ్) : కేసముద్రం సిపిఎం మండల పార్టీ కార్యాలయంలో దక్షిణ భారతదేశం లో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా, సిపిఎం, కేసముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాడం జరిగింది. ఈ సందర్భంగా మండల పార్టీ కార్యదర్శి గోడిశాల .వెంకన్న మాట్లాడుతూ, భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పుచ్చలపల్లి సుందరరామి రెడ్డి అసమానతలు లేని వర్గ రహిత సమాజం కోసం, తన పేరు చివర ఉన్న రెడ్డి తొలగించుకు నీ సుందరయ్యగా సుప్రసిద్ధులు, అయ్యారు. యావదస్తిని వ్యవసాయ కార్మికులు దళితుల కోసం పంచి పెట్టినారు, భారతదేశ తొలి ప్రతిపక్ష నాయకుడిగా సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లేవారు, పిల్లలు ఉంటే స్వార్థం పెరుగుతుందని లీల సుందరయ్య ఆదర్శ దంపతులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని దేశంలోని శ్రామిక అనగారిన వర్గాలే తమ పిల్లలుగా ప్రజాసేవకే జీవితం అంకితం చేసిన నిస్వార్ధ ఆదర్శ దంపతులు, వారి ఆశయాలు కొనసాగించడానికి ప్రతి ఒక్క పార్టీ సభ్యుడు కార్యకర్త కృషి చేయాలని అదే సుందరయ్య గారికి మనం ఇచ్చే నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బొబ్బల. యాకుబ్ రెడ్డి, చాగంటి కిషన్, మోడెం.వెంకటేశ్వర్లు, జల్లే జయరాజ్, నీరుటి. జలంధర్, సోమరపు. ఎల్లయ్య, ముద్రగోల సారయ్య, గూగులోత్. కేశ్యా తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 
కరీంనగర్ : లోకల్ గైడ్:వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...
సబ్సిడీ జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 
జాతీయ రక్షణ నిధికి లక్ష రూపాయల విరాళం
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై శ్రద్ధ వహించండి
జీలుగు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి    
గణంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి. 
తొర్రురులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం