పెరిగిన మెట్రో చార్జీలు 10 శాతం తగ్గింపు.....
లోకల్ గైడ్ : ఇటీవల పెరిగిన మెట్రో చార్జీలను రద్దు చేయాలంటూ ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో స్పందించిన ఎల్ అండ్ టీ, ప్రయాణికుల భారం తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. పెరిగిన చార్జీలపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీ మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.ఇది వరకూ కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కి, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కి పెరిగిన సంగతి విదితమే. ఈ పెరిగిన చార్జీలు మే 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఛార్జీల పెంపుతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇప్పుడు అమల్లో ఉన్న మెట్రో టికెట్ ధరలు ఇలా ఉన్నాయి:
మొదటి 2 కి.మీ. వరకు – రూ. 12
2 నుండి 4 కి.మీ. వరకు – రూ. 18
4 నుండి 6 కి.మీ. వరకు – రూ. 30
6 నుండి 9 కి.మీ. వరకు – రూ. 40
9 నుండి 12 కి.మీ. వరకు – రూ. 50
12 నుండి 15 కి.మీ. వరకు – రూ. 55
15 నుండి 18 కి.మీ. వరకు – రూ. 60
18 నుండి 21 కి.మీ. వరకు – రూ. 66
21 నుండి 24 కి.మీ. వరకు – రూ. 70
24 కి.మీ. పైగా – రూ. 75
ఈ నిర్ణయంతో ప్రయాణికులపై ఉన్న ఆర్థిక భారం కొంతమేర తగ్గే అవకాశం ఉంది.
Comment List