“మాకూ టైమ్ వస్తుంది... అప్పుడు చూపిస్తాం”: చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ టీడీపీపై మండిపడ్డ జగన్ – రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శ
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికార టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ, “పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని” జగన్ ఆరోపించారు.
“రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో తమకు సంఖ్యాబలం లేకున్నా టీడీపీ పోటీలో దిగుతోంది. మెజారిటీ లేకపోయినా గెలిచినట్లు తప్పుడు ప్రకటనలు చేస్తోంది. ఇవన్నీ సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు” అని జగన్ ధ్వజమెత్తారు.
“మాకూ టైమ్ వస్తుంది... అప్పుడు మా దమ్మేంటో చూపిస్తాం” అంటూ ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. జగన్ వ్యాఖ్యలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఊపిరి పీల్చేలా చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.
Comment List