పుష్కరాల్లో సరస్వతి నవరత్నమాల హారతి
హైదరాబాద్ (లోకల్ గైడ్: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సరస్వతి నవరత్నమాల హారతి ఘట్టాన్ని ప్రతీ రోజూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు నేటి నుండి ఈ హారతికార్యక్రమాన్ని లైవ్ కవరేజి చేస్తారు. ప్రతీ రోజు సాయంత్రం నిర్వహించే సరస్వతి హారతిని ఇవ్వడానికి, కాశీలో అత్యంత ప్రజాదరణ పొందిన గంగా హారతినిచ్చే పండితులను ప్రత్యేకంగా ప్రభుత్వం పిలిపించింది. దాదాపు అరగంట పాటు సాగే సరస్వతి నవరత్నమాల హారతిలో తొమ్మిది ప్రత్యేక హారతులను ఇస్తారు.
సరస్వతి నవరత్నమాల స్తోత్రంతో తొమ్మిది హారతులు
ఓంకార హారతి..సర్వ దోష నివారిణి
నాగ హారతి - సర్పదోషాని పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది
పంచ హారతి - దీర్ఘాయుష్షుకు
సూర్య హారతి రోగాలను మాపి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
చంద్ర హారతి - పాడి పంటలను, మన: శాంతినిస్తుంది.
నంది హారతి - ధర్మ బుద్ధిని, శక్తిని, విద్య బుద్ధినిస్తుంది.
సింహ హారతి. నాయకత్వాన్ని ధైర్యాన్నిస్తుంది.
కుంభ హారతి -సంపదను ఇచ్చి, కోటి సుఖాలను అందిస్తుంది.
నక్షత్ర హారతి - నిర్మలమైన మనస్సును, కీర్తిని అందిస్తుంది.
Comment List