దేశవ్యాప్తంగా ట్రాఫిక్ జరిమానాలు రూ.12 వేల కోట్లు!
కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే వసూలు – బెంగళూరులో ఓ వ్యక్తికి రూ.3 లక్షల ఫైన్
లోకల్ గైడ్ :
భారతదేశంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, గత ఏడాది మొత్తం ట్రాఫిక్ జరిమానాల మొత్తం రూ.12 వేల కోట్లకు చేరుకుందని ఓ తాజా నివేదిక వెల్లడించింది. అయితే, అందులో కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే వసూలైనట్లు పేర్కొనడం గమనార్హం.నివేదిక ప్రకారం, ఈ జరిమానాల్లో సుమారుగా 55 శాతం జరిమానాలు కార్లకు సంబంధించగా, మిగిలిన 45 శాతం ద్విచక్ర వాహనాలకు సంబంధించినవిగా వెల్లడించింది. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.బెంగళూరులోని ఓ ద్విచక్ర వాహనదారుడు అత్యధికంగా 500 సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, ఏకంగా రూ.3 లక్షల జరిమానా చెల్లించాడని నివేదిక తెలిపింది. ఈ ఘటన ట్రాఫిక్ నియమాలపై ప్రజల అవగాహనలో లోపాన్ని మరోసారి స్పష్టంచేస్తోంది.అధికారులు, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై మరింత బాధ్యతాయుతంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జరిమానాల వసూలులో కూడా ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
Comment List