శాంతియుత వాతావరణం లో పండగలు జరుపుకోవాలి -----------

మత పెద్దలతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన,

శాంతియుత వాతావరణం లో పండగలు జరుపుకోవాలి  -----------

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్,

-------పశువుల అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వండి

-------సోషల్ మీడియాలో మత ఘర్షణలు రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తప్పవు,

వనపర్తి లోకల్ గైడ్, 

మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే వనపర్తి జిల్లాలో బక్రీద్‌, హనుమాన్ జయంతి పండుగలను సోదర భావంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ అన్నారు.
జూన్ 7వ తేదీన జరగబోయే బక్రీద్, హనుమాన్ జయంతి పండుగల సందర్భంగా బుధవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో మతపెద్దలతో శాంతి సమావేశాన్ని  నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ..... బక్రీద్ ,హనుమాన్ జయంతి పండుగ పర్వదినాలను శాంతియుత వాతావరణంలో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగ జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండగలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా పండుగలను మత సామరస్యంతో జరుపుకునే విధంగా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయం ఏర్పడేలా చేయాలన్నారు. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల మీదుగా వచ్చే పశువుల అక్రమ రవాణా కట్టడికి జిల్లా పరిధిలో పశుసంవర్ధక శాఖ సిబ్బందితో  3 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి పశువులను రవాణాచేసే ప్రతి వాహనానికి తగు నిర్థారిత ప్రమాణిక పత్రాలు వాలిడ్ డాక్యుమెంట్స్ ఉంటేనే, పరిశీలించి అనుమతిస్తారని అన్నారు. 
ప్రధానంగా నిబంధనలు విరుద్ధంగా పశువులు అక్రమ రవాణా జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, చట్టాన్ని ఏవరు కూడా తమ చేతుల్లోకి తీసుకొని శాంతి భధ్రతలకు విఘాతం కల్పించే పరిస్థితులు తీసుకొనిరావద్దని అన్నారు. ఏదైనా సమస్య వుంటే  సామరస్య పరిష్కారానికి  పోలీస్ అధికారులు నిరంతరం అందుబాటులో వుంటారని అన్నారు. ముఖ్యంగా యువత ఆవేశంతో చేస్తున్న చిన్న తప్పులు శాంతి భద్రతల సమస్యగా తలెత్తె ప్రమాదం వుంటుంది కాబట్టి వివిధ వర్గాల మతపెద్దలు యువతకు సమన్వయం పాటించేలా దిశానిర్దేశం చేయాలని అన్నారు. ప్రధానంగా జిల్లాలో  ఏచిన్న సంఘటన జరిగిన ఎడిటింగ్ చేసి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల ఐక్యతను, సామరస్యానికి భంగం కలిగించే విధంగా విద్వేషాలు, రెచ్చగొట్టే, అసభ్యకర పోస్టులు పెట్టడం తద్వారా శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తున్న వారిపై పోలీస్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా పెట్టిందని తెలిపారు. అదేవిధంగా సభలు, సమావేశాలు,ర్యాలీలకు ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోవాలని, తద్వారా అవసరమైన భద్రతను కల్పించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఈద్గా ప్రాంతాలలో ముస్లిం సోదరుల సామూహికంగా ప్రార్థన కోసం వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగ కుండా ట్రాఫిక్ ,పార్కింగ్ ,
పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు ప్రత్యేక చోరవ తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ఈ శాంతి సంఘ సమావేశంలో వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు డిసిఆర్బి డీఎస్పీ, ఉమామహేశ్వరరావు, వనపర్తి మున్సిపల్ కమిషనర్, ఎన్ వెంకటేశ్వర్లు, వనపర్తి సిఐ, కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్,వనపర్తి పశువైద్యశాఖ ఏడి, మీరజ్ అహ్మద్, వెటర్నరీ డాక్టర్, మల్లేష్, జిల్లాలోని గోషాల నిర్వహకులు, వివిధ కులాల మత పెద్దలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణలో భారీ వర్షాలు – పిడుగుల హెచ్చరిక జారీ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన తెలంగాణలో భారీ వర్షాలు – పిడుగుల హెచ్చరిక జారీ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
తెలంగాణలో మళ్లీ వర్షాల సెగ మొదలైంది. రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)...
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వెనక్కి తగ్గిన 2021 ఆపరేషన్‌పై పెంటగాన్ సమగ్ర సమీక్ష
ఏఐ ఏజెంట్ మోడ్ ప్రవేశపెట్టిన గూగుల్ – అద్దె ఇల్లు వెతకడం, షాపింగ్, వీడియో సృష్టించడంతో సహా అన్ని సేవలు మరింత ఈజీ!
దేశంలో ఐటిరంగాన్ని పరిచయం చేసిన మహనీయుడు  రాజీవ్ గాంధీ 
రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలి.
శాంతియుత వాతావరణం లో పండగలు జరుపుకోవాలి -----------
సెయింట్స్ కాన్స్టంటైన్ మరియు హెలెన్ జయంతి: విశ్వాసంతో, ఘనంగా నిర్వహించిన క్రైస్తవులు