'డ్రాగన్' చిత్రంలో కీలక పాత్రలో విద్యాబాలన్ – మరోసారి నందమూరి కుటుంబంతో జత
లోకల్ గైడ్ :
బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలో ఒకదాన్ని మాత్రమే ఇప్పటివరకు పోషించారు. నటరత్న నందమూరి తారకరామారావు బయోపిక్లైన కథానాయకుడు, మహానాయకుడు చిత్రాల్లో ఆయన భార్య బసవతారకం పాత్రలో మెప్పించారు. ఆ సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన విద్యాబాలన్‌కు నందమూరి బాలకృష్ణ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆమెకు పట్టుచీర, పసుపు కుంకుమలతో ఘనంగా సన్మానం చేశారు. ఆ అనుభవాన్ని విద్యాబాలన్ ఎప్పటికీ మర్చిపోలేదని చెబుతారు.ఇప్పుడీ గ్యాప్ తర్వాత విద్యాబాలన్ మళ్లీ నందమూరి కుటుంబంతో పని చేసే అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్‌లో విద్యాబాలన్ ఓ పవర్ఫుల్ రోల్ చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.ప్రశాంత్ నీల్ గతంలో కేజీఎఫ్ 2లో రవీనా టాండన్‌కు ఇచ్చిన ప్రత్యేక పాత్రను చూసిన విద్యాబాలన్ కూడా డ్రాగన్‌లో తన పాత్రపై నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, సంగీతాన్ని అజనీశ్ లోక్‌నాథ్ అందిస్తున్నారు. డ్రాగన్ మూవీ 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
Comment List