వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేసిన మోడీ
హనుమకొండ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్): ఉమ్మడి వరంగల్, నర్సంపేట నియోజకవర్గ ప్రాంత ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి అనుకూలంగా ఉన్నటువంటి వరంగల్ రైల్వే స్టేషన్ ని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ₹25.41 కోట్ల వ్యయం తో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన వరంగల్ రైల్వే స్టేషన్‌ను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రోజు ఉదయం 11:00 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి అతిథులుగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ , మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్,మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి.కె. అరుణ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు రాష్ట్ర క్రమశిక్షణ సంఘ చైర్మన్ మార్తినేని ధర్మారావు, బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాం నాయక్, వన్నాల శ్రీరాములు, డాక్టర్ టి రాజేశ్వరరావు లతో కలిసి పాల్గొన్న బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, ఈ సందర్భంగా
కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ: భారత ప్రధాని గా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి తీవ్ర కృషి చేస్తున్నారు..అందులో భాగంగా రైల్వే శాఖను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రైల్వే స్టేషన్లను నూతన హంగులతో అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసాం..రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం ద్వారా సామాన్యులందరీకి అన్ని సదుపాయాలని కల్పించే విధంగా రైల్వే స్టేషన్ పునరుద్ధరించారు. 2014కు ముందు రైల్వే బడ్జెట్కు కేటాయించిన బడ్జెట్ కంటే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ చాలా ఎక్కువ..కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి వైపు నడిపిస్తున్న నేపథ్యంలో ప్రజలు నాయకత్వాన్ని అభినందించాల్సిన అవసరం ఉంది..
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఇక్కడి నాయకులతో కలిసి పనిచేసిన బంధం, అనుభవం నాకుందని అన్నారు.వరంగల్ ప్రజలకు మరొకసారి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.పార్లమెంట్ సభ్యులు డి.కె. అరుణ, ఈటల రాజేందర్ మాట్లాడుతూ..నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో దానికి సజీవ సాక్ష్యం ఈరోజు పునఃప్రారంభమైన మన వరంగల్ రైల్వే స్టేషన్ అన్నారు. ఎయిర్పోర్టులను తలపించే పద్ధతిలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందుతున్నాయి.స్వతంత్రం వచ్చినప్పుడు నుండి 2014 వరకు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ పది సంవత్సరాల కాలంలో అంతకంటే వేగంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి సజీవ సాక్ష్యం శుక్రవారం రోజు పునఃప్రారంభమైన బేగంపేట్, కరీంనగర్, వరంగల్ ఇలా 103 రైల్వే స్టేషన్లు.రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందదు. రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏవైనా ఉండొచ్చు కానీ అన్ని రాష్ట్రాలు సమగ్రంగా అభివృద్ధి చెందితే దేశం బాగుపడుతుందని చెప్పి మోడీ భావిస్తున్నారు.
వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి బిజెపి జిల్లా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా నాయకులు , మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List