అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు

అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు

లోక‌ల్ గైడ్ :
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇంగ్లాండ్ పర్యటన కోసం అండర్-19 జట్టును అధికారికంగా ప్రకటించింది. ఈ పర్యటన జూన్ 24 నుంచి జూలై 23 వరకు జరగనుండగా, భారత జట్టు మొత్తం 8 మ్యాచ్‌లను ఆడనుంది. వీటిలో ఒక వార్మప్ మ్యాచ్, ఐదు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్‌లు ఉంటాయి.ఈ సిరీస్‌కు చెన్నై సూపర్ కింగ్స్ యువ క్రికెటర్ ఆయుష్ మాత్రేకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. ముంబయి వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 17 ఏళ్ల మాత్రే ఇప్పటివరకు 9 ఫస్ట్ క్లాస్, 7 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడి 962 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో చెన్నై తరఫున రితురాజ్ గైక్వాడ్ స్థానంలో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్నాడు.

14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ

ఇప్పటిదాకా ఐపీఎల్‌లో అత్యంత చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా పేరు పొందిన వైభవ్ సూర్యవంశీకి కూడా జట్టులో చోటు దక్కింది. బీహార్‌కు చెందిన ఈ ఆటగాడు గత నెల గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ చేసి కృష్ణమెహర్ అయ్యాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం. బీహార్ తరఫున ఐదు ఫస్ట్ క్లాస్, ఆరు లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, సెంచరీ నమోదు చేయలేకపోయాడు. అయితే గత ఏడాది ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన యూత్ టెస్ట్‌లో సెంచరీ చేశాడు.

బౌలింగ్ విభాగంలో ఆకర్షణ

కేరళకు చెందిన లెగ్ స్పిన్నర్ మహ్మద్ అన్నన్‌ను కూడా జట్టులో ఎంపిక చేశారు. గత డిసెంబర్‌లో ఆస్ట్రేలియా అండర్-19తో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో 16 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. పంజాబ్ ఆఫ్ స్పిన్నర్ అన్మోల్‌జిత్ సింగ్ కూడా జట్టులో స్థానం సంపాదించాడు.

భారత అండర్-19 జట్టు (ఇంగ్లాండ్ టూర్):
ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుండు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్‌ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహా, ప్రణవ్ రాఘవేంద్ర, మహ్మద్ అన్నన్, ఆదిత్య రాణా, అన్మోల్‌జిత్ సింగ్.

స్టాండ్‌బై ప్లేయర్లు:
నమన్ పుష్పక్, డీ. దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (వికెట్ కీపర్).

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు
లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందడానికి మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులను కనుగొనండి. ఈ వస్తువులు మీ జీవితంలో శ్రేయస్సును ఎలా ఆకర్షిస్తాయో మరియు శుభ...
వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేసిన మోడీ
అర్హత కలిగిన పేద కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి
చేయూత పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలి.
శిల్పారామంలో ప్రపంచ సుంద‌రీమ‌ణుల సంద‌డి 
అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు