రాబోయే స్థానిక సంస్థల  గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరు కలిసికట్టుగా పనిచేయాలి

రాబోయే స్థానిక సంస్థల  గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరు కలిసికట్టుగా పనిచేయాలి

- నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య ఉన్న  నేరుగా తన వద్దకు రావాలి
- అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది 
- పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి

వరంగల్/రాయపర్తి  (లోకల్ గైడ్ ): రాయపర్తి మండలం, మోరిపిరాల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ పనులనూ స్థానిక ప్రజలు, నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో కలిసి టెంకాయ కొట్టి ప్రారంభించిన  పాలకుర్తి ఎమ్మెల్యే  యశస్విని ఝాన్సీ రెడ్డి. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సురక్షిత మంచినీటి వాటర్ ప్లాంట్ ను స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తదనంతరం 
 శివరాంపురం గ్రామస్తుల ఆహ్వానం మేరకు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ దుర్గామాత ఉత్సవాలలో స్థానిక నాయకులతో కలిసి,అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింఛీ, మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి  మాట్లాడుతూ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ఎవరికి ఏ సమస్య ఉన్న నేరుగా తన వద్దకు తీసుకురావాలని అన్నారు, రోడ్డు నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నాణ్యతలో  ఎక్కడ రాజీ పడకుండా, నిర్ణీత సమయంలో నిర్మాణ పనులను పూర్తి చేయాలని తెలిపారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన స్వల్ప కాలంలోనే అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు,ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులందరికీ అందిస్తామని, పథకాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని, రాబోయే స్థానిక సంస్థల గెలుపు లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు, గ్రామ పార్టీ నాయకులు, మండల ముఖ్య నాయకులు, యువజన నాయకులు, మహిళ నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు
లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందడానికి మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులను కనుగొనండి. ఈ వస్తువులు మీ జీవితంలో శ్రేయస్సును ఎలా ఆకర్షిస్తాయో మరియు శుభ...
వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేసిన మోడీ
అర్హత కలిగిన పేద కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి
చేయూత పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలి.
శిల్పారామంలో ప్రపంచ సుంద‌రీమ‌ణుల సంద‌డి 
అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు