వంగూరి వాచకం -నవరత్నాలు 

వంగూరి వాచకం -నవరత్నాలు 

వంగూరి వాచకం -నవరత్నాలు 

1. అల్పుడను నేనేమి 
చేయగలనని నిరాశ నీకేలా 
అల్పప్రాణి చిట్టెలుక
గణేశుని మోసుకు ఊరేగడం లేదా 

2.నచ్చింది తింటే 
వచ్చేను తంటా 
సమతుల ఆహారమైతే 
సమగ్ర ఆరోగ్యం నీ వెంటే 

3.ఆ గోడు వీడి
 ఈ గూడు చూడు 
కాదా విలువైన నిపుణుడు 
మన ఘనమైన గిజిగాడు

 4.ఆస్తి అంతస్తులు 
పెంచేను అహంకారం 
ఔన్నత్య వ్యక్తిత్వం 
కలిగించేను మమకారం 

5.గురువు మాట దాటవేయ 
పరువు చెరువుపాలు కాదా 
శుక్రాచార్యుని లెక్కచేయని 
చక్రవర్తి ‘బలి’ కాలేదా 

6.బడిలో కలిపేది 
బలమైన సోపతి 
అనంతకాలం నిలిపేది 
అరుదైన అనుభూతి 

7.పేరు పెడితే 
వీరుడు అయి తీరునా
పాత్ర మారితే 
పాయసం రుచి మారునా 

8.లిపి గుండ్రమైతే 
మాట మధురం 
చరిత పురాతనమైతే 
తెలుగు అజంత వరం 

9.చేసిన దోషము 
చెరిపేయ తరమా 
మంట ఆరినా
మసి అంటదా

వంగూరి గంగిరెడ్డి
9652286270
షాద్ నగర్

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News