ప్రజా ప్రతినిధిగా ప్రతి పల్లెను తట్టిన ప్రజా నాయకుడు డాక్టర్ మెతుకు ఆనంద్
బంట్వారం మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లాపూరం శ్రీనివాస్
వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్:
బంట్వారం మండల కేంద్రంలో, వికారాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించుకున్నారు, మండల కేంద్రంలో కేక్ కటింగ్ చేసి అనంతరం వికారాబాద్ నుండి అనంతగిరి దేవాలయం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం వరకు ర్యాలీగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి, జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ సందర్భంగా బంట్వారం మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లాపురం శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎన్నికై వికారాబాద్ చరిత్రలో ఎమ్మెల్యేగా ప్రతి గ్రామాన్ని ప్రతి వీధిని సందర్శించిన ఖ్యాతి డాక్టర్ మెతుకు ఆనంద్ కు దక్కుతుందని, మీతో నేను కార్యక్రమంతో ప్రతి పల్లెను తట్టి సమస్యల పరిష్కారానికి వారు చేసిన కృషి ప్రతి మనిషికి గుర్తుండి పోతుందన్నారు, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఎన్నికై ప్రజల కోసం పనిచేసిన ప్రజానాయకుడు డాక్టర్ మెతుకు ఆనంద్ రాబోయే రోజుల్లో మళ్లీ ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మండల ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డి, మండల రైతు బంధు మాజీ అధ్యక్షులు ఖాజా పాషా, ప్రధాన కార్యదర్శులు మబ్బు రాజు, బి.శ్రీనివాస్, సీనియర్ నాయకులు బల్వంత్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు నర్సిములు, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్, సుధాకర్ గౌడ్, ఎర్ర ఆనంతి, ఖలీమ్ పాషా, ఏలియా, లాజర్, నర్సిములు, మౌలానా, అశోక్, సుదర్శన్, ఖదీర్, శ్రీకాంత్, నరేష్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List