నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకోవాలి 

- జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్.

నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకోవాలి 

గద్వాల, లోకల్ గైడ్ :
ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులకు ఆదేశించారు. గురువారం ధరూర్ మండలం అల్వాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పనులను, క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఇండ్ల నిర్మాణం పనులు ఎలా జరుగు తున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలకు విడతల వారిగా 5 లక్షల రూపాయలను అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిధులు  అందిస్తున్నందున లబ్ధిదారులు ఆలస్యం చేయకుండా నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. నిర్మాణపు పనులను వేగవంతంగా పూర్తి అయ్యేవిధంగా లబ్ధిదారులను ప్రోత్సహించాల్సిందిగా ఆదేశించారు. తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణ విధానాన్ని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం 400 నుంచి 600 చ.అ.లోపు నాణ్యతతో, తక్కువ వ్యయంతో పూర్తి చేయాలనీ, లబ్ధిదారులకు సరళమైన డిజైన్‌, నిర్మించాలన్నారు. ప్రజలు మట్టి సమస్యను ప్రస్తావించిన నేపథ్యంలో, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి అవసరమైన కేవలం మట్టిని స్వంత భూమిలో నుంచి తవ్వించుకోవడానికి ఎవరికెవరికీ మట్టి అవసరమో వారి జాబితాను తహసీల్దార్‌కు సమర్పించాలని, వాటికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో 32 బేస్‌మెంట్ దశలో, 2 రూఫ్ లెవెల్ దశలో ఉన్నాయని తెలిపారు. 21 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా లక్ష రూపాయల నిధులు విడుదలయ్యాయని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ యాప్ లో నమోదు చేస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం వెంటనే అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ‌ ద‌శ‌ల‌ను బ‌ట్టి దశల వారీగా ల‌బ్దిదారుల‌కు వారి ఖాతాలోనే నేరుగా డ‌బ్బుల‌ను జమ చేయడం జరుగుతుందని అన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్, హౌసింగ్ డి.ఈ నరేందర్, ఎ.ఈ ప్రకాష్, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News