సంక్రాంతి బరిలోకి టాలీవుడ్ స్టార్ హీరోలు – భారీగా రెడీ అవుతున్న చిత్రాలు!

సంక్రాంతి బరిలోకి టాలీవుడ్ స్టార్ హీరోలు – భారీగా రెడీ అవుతున్న చిత్రాలు!

లోక‌ల్ గైడ్: సంక్రాంతి పండుగకు టాలీవుడ్‌లో ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పండుగ సందర్భంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉండటంతో, స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ముందుగానే ప్లానింగ్‌లోకి వెళ్తారు. చిన్న సినిమా కానీ, పెద్ద సినిమా కానీ – సంక్రాంతి బరిలో రాబోయే సినిమాల హడావిడి మొదలైంది. ఇప్పటినుంచే స్టార్ హీరోలు తమ సినిమాలను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ‘మెగా 157’

మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ “మెగా 157” పైన భారీ అంచనాలున్నాయి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. చిరు ఇందులో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో కనిపించనున్నాడు. కామెడీ, యాక్షన్ మిశ్రమంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. నిర్మాతలుగా సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఉన్నారు. ఈ సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి.
నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’తో బరిలోకి

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న “అనగనగా ఒక రాజు” చిత్రం కూడా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. మారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 14న సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు టీమ్ అధికారికంగా ప్రకటించింది.
రవితేజ 76: సంక్రాంతి కానుకగా మాస్ మహారాజా కొత్త సినిమా

మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కనున్న కొత్త చిత్రం అధికారికంగా శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది ఆయన 76వ సినిమా కావడంతో ‘రవితేజ 76’గా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్రబృందం ఓ ఆసక్తికర పోస్టర్‌ను విడుదల చేసింది. అలాగే, 2025 జనవరిలో సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పండుగ బరిలో చిరంజీవి, నవీన్ పొలిశెట్టి వంటి స్టార్ హీరోల సినిమాలు కూడా రెడీ అవుతుండటంతో, ఈసారి బాక్సాఫీస్‌ వద్ద భారీ పోటీ నెలకొనున్నట్లు సినీప్రియులు అంచనా వేస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News