ఉత్కంఠగా ఆది సాయికుమార్ ‘శంబాల’ టీజర్

ఉత్కంఠగా ఆది సాయికుమార్ ‘శంబాల’ టీజర్

టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘శంబాల: ఏ మిస్టిక్ వరల్డ్’. యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్న ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్‌లో అర్చన అయ్యర్, స్వాసిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజశేఖర్ అన్నభీమోజు మరియు మహీధర్ రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం."ఈ విశ్వంలో ఎన్నో అంతుబట్టని రహస్యాలున్నాయి. సైన్స్‌ వాటికి సమాధానం చెప్పలేకపోతే మూఢనమ్మకం అంటుంది… అదే వాటికి సమాధానం దొరికితే తన గొప్పతనంగా చెప్పుకుంటుంది" అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. ఆపై ఆకాశం నుంచి ఉల్కలా వచ్చిన ఓ రాయి ఓ గ్రామంలో పడుతుంది. అప్పటి నుంచీ ఆ గ్రామంలో ఉన్న ప్రజలు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడతారు. ఆ రహస్యానికి అసలు కారణం ఏమిటనేది సినిమా చూస్తే తెలియనుంది. ఇందులో ఆది సాయికుమార్ ఒక భౌగోళిక శాస్త్రవేత్త పాత్రలో కనిపించనుండగా, ఆయన పాత్ర చాలానే ఛాలెంజింగ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News