అఖిల్ రిసెప్షన్‌లో మహేష్ బాబు టీషర్ట్ హైలైట్‌..! ధర తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

అఖిల్ రిసెప్షన్‌లో మహేష్ బాబు టీషర్ట్ హైలైట్‌..! ధర తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!

టాలీవుడ్ అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి మరో మధుర ఘటన ఇటీవల జరిగింది. నాగార్జున తనయుడు అఖిల్ జూన్ 6న జైనబ్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నాగార్జున నివాసంలో ఈ పెళ్లి ప్రైవేట్‌గా జరగ్గా, జూన్ 8న హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించారు.

ఈ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో హాజరవుతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రత్యేకించి మహేష్ బాబు ధరించిన Hermès బ్రాండ్ టీషర్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అతని స్టైల్‌పై అభిమానులు ఫిదా అవుతుండగా, ఆయన ధరించిన ఆ టీషర్ట్ ధర ఎంత అని గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టారు. అసలు ధర తెలిసి అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ Hermès టీషర్ట్ ధర $1775 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 1.54 లక్షలు!

స్టైలిష్ లుక్స్‌తో మహేష్ బాబు అఖిల్ రిసెప్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఇప్పుడు ఆయన ధరించిన టీషర్ట్ నెట్టింట సంచలనంగా మారింది!

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 బస్సుపాస్ ఛార్జీల పెంపు – కొత్త ధరలు ఇవే!  బస్సుపాస్ ఛార్జీల పెంపు – కొత్త ధరలు ఇవే!
తెలంగాణ ఆర్టీసీ బస్సుపాస్ ఛార్జీలను పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో ప్ర‌భుత్వం ఛార్జీల పెంపునకు ఆమోదం తెలిపింది. తాజాగా అన్ని విభాగాల్లో టికెట్...
హఫీజ్ పేట్ డివిజన్ లో నెలకొన్న సమస్యలపై ప్రజావాణిలో పిర్యాదు
నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్
ఓల్డ్ ఏంఐజి బీసీ మహిళల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం
అఖిల్ రిసెప్షన్‌లో మహేష్ బాబు టీషర్ట్ హైలైట్‌..! ధర తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్న మోదీ ప్రభుత్వం..
దాడులకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి.