ఓల్డ్ ఏంఐజి బీసీ మహిళల ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం
-పాల్గొన్న..పటేల్ కృష్ణ, నర్సింగ్ రావు, లలిత రాణి

శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ): బీసీ కులాల, బీసీ సంఘాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంఘాల నిర్మాణంలో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలుగా యు.సంగమ్మకు త్వరలో నియామక పత్రం అందుకోనున్నారు. అన్ని డివిజన్ ల నుండి హైదరాబాద్ పట్టణం వరకు ప్రతి గ్రామం బస్తి, కాలనీలో గల్లీ గల్లీకి బీసీ సంఘాలు ఏర్పాటు చేసే క్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్, బేరి రామచంద్ర యాదవ్ బృందం ఆదేశాలతో శేరిలింగంపల్లి డివిజన్ ఓల్డ్ ఏంఐజి మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి శేరిలింగంపల్లి డివిజన్ మహిళా సంఘం అధ్యక్షురాలుగా సంగమ్మని నియమించాలని సమావేశంలో నిర్ణయించడం జరిగింది. పూర్తిస్థాయి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు శేరిలింగంపల్లి తదుపరి సమావేశంలో మహిళాలు సమావేశానికి ఆహ్వానించి పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. మహిళలందరు ముందుకొచ్చి మహిళా సంఘాలు ఏర్పాటు చేసుకోవడం శుభసూచకం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యనాయకులు మాట్లాడుతూ..మహిళలు అందరు ఏకం కావాలి అని, ఏకమైతేనే సమస్యలు దూరం అవుతాయి, 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీసీల ఐక్యమత్యంతో రాజ్యాధికారం సాధించుకుందాం అని అన్నారు. అనంతరం త్వరలో అధ్యక్షురాలుగా నియామకం అందుకోబోతున్న సంగమ్మకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ, బిసి సంఘం ఉపాధ్యక్షులు నర్సింగ్ రావు ముదిరాజ్, మహిళా సంఘం కోఆర్డినేటర్ లలిత రాణి, సంగమ్మ, విజయలక్ష్మి, సి.మురళీధర్, లతా బి.విద్యాసాగర్, ఎస్.అనిత, జి.మంగు బాయి, లతా, వి.పావని, ఎన్.రమాదేవి, పి విజయ, కె.జ్యోతి శ్రీ, యు.మంజుల, బి.శ్రీదేవి, యు.శ్రీలత, ఫాతిమా బేగం, యు.సంధ్యా, తదితరులు పాల్గొన్నారు.
About The Author
Latest News
