‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం

‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం

లోకల్ గైడ్:  VarunTej | టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్ర‌స్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక హర్రర్-కామెడీ చిత్రంలో నటిస్తున్న విష‌యం తెలిసిందే.VarunTej | టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్ర‌స్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మెర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక హర్రర్-కామెడీ చిత్రంలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. ‘కొరియన్ కనకరాజు’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ ఇండో-కొరియన్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.ఇదిలావుంటే.. తాజా సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశ‌లు ఉన్న‌ట్లు తెలుస్తుంది. టాలీవుడ్ దర్శకుడు రాధాకృష్ణతో కలిసి పనిచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాధాకృష్ణ గతంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.‘రాధే శ్యామ్’ విడుదల తర్వాత రాధాకృష్ణ తన తదుపరి చిత్రం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పుడు వరుణ్ తేజ్‌కు ఆయన ఒక అందమైన ప్రేమకథను వినిపించారని సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ కథ వరుణ్ తేజ్‌ను ఎంతగానో ఆకట్టుకుందని సమాచారం. ప్రస్తుతానికి ఇది కేవలం ఊహాగానం మాత్రమే. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అధికారికంగా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, వరుణ్ తేజ్ మరియు రాధాకృష్ణ కాంబినేషన్‌లో ఎలాంటి చిత్రం వస్తుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే  జీవితంలో ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే  జీవితంలో ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది
లోకల్ గైడ్ : బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పదవీ విరమణ పొందుతున్న షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, యువజన క్రీడల అధికారి హనుమంతరావు,...
లక్షెట్టిపేట మండలం టాపర్
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉత్తంకుమార్ రెడ్డి
అధ్వానంగా తయారైన రోడ్డు
Yerra Yerrani Rumalu Gatti Singer Mallamma Emotional Interview | Anchor & Singer Manjula Yadav
బసవేశ్వరుని బోధనలు స్ఫూర్తిదాయకం
కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్