కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌ ఆశలకు చెన్నై గండికొట్టింది

కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌ ఆశలకు చెన్నై గండికొట్టింది

ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసు ఉత్కంఠభరితంగా మారింది. ప్రతి మ్యాచ్‌తో సమీకరణాలు మారుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో గెలిచే తీరున ఉండాల్సిన డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌), చెన్నై చేతిలో ఓడిపోయి ప్లేఆఫ్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బుధవారం ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) రెండు వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన సీఎస్‌కే, ఈ విజయంలో తోడుగా కోల్‌కతా ఆశలకు పెద్ద దెబ్బకొట్టింది. చెన్నై ఆటతీరు, చెపాక్‌ స్టేడియాన్ని గుర్తుచేస్తుండగా, ఈడెన్‌ గార్డెన్స్‌ పసుపు జెర్సీలతో చెన్నై రంగులో కనిపించింది.
12 మ్యాచ్‌ల్లో కేవలం ఐదు గెలుపుతో కేకేఆర్‌ ప్రస్తుతం పట్టికలో 6వ స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెన్నై టీమ్‌ ఈ సీజన్‌లో మూడో విజయం నమోదు చేసుకుంటూ, 2018 తర్వాత తొలిసారి 180కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
ఈ మ్యాచ్‌లో నూర్‌ అహ్మద్‌ (4/31) ధాటికి కేకేఆర్‌ 20 ఓవర్లలో 179/6 చేసి నిలిచింది. రహానే (48), రస్సెల్‌ (38), మనీశ్‌ పాండే (36 నాటౌట్‌) రాణించారు. అనంతరం బ్రెవిస్‌ (52) విజృంభణతో చెన్నై 19.4 ఓవర్లలో 183/8తో లక్ష్యాన్ని చేధించింది. శివమ్‌ దూబే (45) మద్దతుగా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో వైభవ్‌ అరోరా 3, రానా, వరుణ్‌ చెరో 2 వికెట్లు తీశారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News