బసవేశ్వరుని బోధనలు స్ఫూర్తిదాయకం
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
By Ram Reddy
On
లోకల్ గైడ్: బసవేశ్వరుని బోధనలు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. మహాత్మా బసవేశ్వర 892 జయంతిని పురస్కరించుకొని బుధవారం జిల్లా కలెక్టరేట్ లో బసవేశ్వర చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. మహాత్మా బసవేశ్వరుడు సమసమాజ స్థాపన కోసం పోరాటం చేశారని, కులవ్యవస్థ నిర్మూలనకు ఆయన చేసిన కృషిసమాజం మరువలేనిదని తెలిపారు. లింగ వివక్షతను సమూలంగా వ్యతి రేకించిన అభ్యుదయ వాది బసవేశ్వరుడని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పుష్ప లత, డిఆర్డీఓ కౌసల్యాదేవి, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
30 Apr 2025 18:04:58
తెలంగాణ పల్లె పాటలు | Telangana Village Songs | Latest Folk Songs | Telugu Folk Songs | LG MEDIA #telaganasongs #villagesongs...
Comment List