నష్టపోయిన ప్రతి గింజకు నష్టపరిహారం..!
ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇస్తాం
షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"
హుటాహుటిన వడగండ్లకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే
ఫరూక్ నగర్ మండలంలో దెబ్బతిన్న పంటల సందర్శన
నష్టపోయిన రైతుల జాబితాను సిద్ధం చేయాలని వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే శంకర్ ఆదేశాలు
చిల్కమర్రిలో రైతులు బరిగేల యాదయ్య, వెంకట్ రెడ్డిలను పరామర్శించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
లోకల్ గైడ్ షాద్ నగర్
అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. రాత్రి కురిసిన అకాల వడగండ్ల వర్షానికి ఫరూక్ నగర్ మండలంలోని అనేక గ్రామాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. ఈ సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హుటాహుటిన శుక్రవారం ఉదయమే నష్టపోయిన పంటలను పరిశీలించారు.ఫరూఖ్ నగర్ మండలం చిల్కమరి గ్రామంలో గత రాత్రి వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న వరి పంటలను అధికారులతో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా చిలకమర్రిలో రైతులు బడికెల యాదయ్య, వెంకట్ రెడ్డి, చిలకమర్రి రవీందర్ రెడ్డిలను తదితరులను కలిసి పంట నష్టానికి గల కారణాలను రైతుల నుండి అడిగి తెలుసుకున్నారు.
నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంట నష్టాన్ని అంచనా వేయాలని వ్యవసాయ శాఖ ఏడి రాజారత్నం, ఏఈ నిశాంత్ కుమార్ తదితరులను ఆదేశించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఆరుగాలం కష్టించి రైతు సాగు చేసి, పండించిన పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం వడగండ్ల వాన వలన రైతులు నష్టపోయి బాధపడుతున్నారని, నష్టపోయిన ప్రతి గింజకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంటలు నష్టపోవడం జరిగిందని ఇలాంటి సమయంలో రైతాంగాన్ని మానవత దృక్పథం కోణంలో ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, షాద్ నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు కొంకళ్ళ చెన్నయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్,నేతలు అగ్గనూర్ బస్వo ,రాజేందర్ రెడ్డి,ఇబ్రహీం,శ్రీశైలం గౌడ్, రాయికల్ శ్రీనివాస్, నవీన్,అందే మోహన్ ముదిరాజ్,రవీందర్ రెడ్డి, నర్సింమా రెడ్డి, మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్,అనిల్,తదితరులు పాల్గొన్నారు..
Comment List