హత్యా కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

- జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి, ఐపీస్.

హత్యా కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు

వికారాబాద్ జిల్లా: లోకల్ గైడ్)

02.04.2015 సంవత్సరంలో యాలాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యా నేరంలో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు మరియు ఒక్కొక్కరికి ₹1000/- (ఒక వెయ్యి రూపాయలు) జరిమానా విధించిన గౌరవ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీ డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి గారు.ఇట్టి తీర్పుకు సంభందించిన వివరాలను  జిల్లా ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి,తెలిపారు. ఈ కేసు యొక్క వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: ఫిర్యాదు దారుడు హరిలాల్, 2013 బ్యాచ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్. అతను నవంబర్ 2013 లో కోడంగల్ పోలీస్ స్టేషన్, నందు పని చేసే సమయం లో  02.04.2015న కోడంగల్ ఎస్.ఐ గారి ఆదేశానుసారం ఎర్రన్ పల్లి గ్రామంలో సస్పెక్ట్ దోమ బుగ్గప్ప (తండ్రి లచ్చప్ప, నివాసం: ఎర్రన్ పల్లి గ్రామం, కోడంగల్ మండలం) అదే గ్రామానికి చెందిన రాములు గౌడ్ కుమారుడైన రవీందర్ గౌడ్‌ను చంపుతానని బెదిరించాడని ఫిర్యాదు రాగ విచారించడానికి హరిలాల్ ఎర్రన్ పల్లి గ్రామానికి తన మోటార్ సైకిల్ నెంబర్  పై వెళ్ళాడు. అక్కడ గ్రామ పంచాయతీ వద్ద రాములు గౌడ్, రాములు గౌడ్ తమ్ముడు లక్ష్మయ్య గౌడ్, పకీరప్ప మరియు ఉప సర్పంచ్ నర్సప్పతో పాటు మరికొంతమంది గుమిగూడి ఉండగా, హరిలాల్ బుగ్గప్ప గురించి అడిగాడు. వారు తిమ్మాయిపల్లి గేటు వద్ద గల దర్గా దగ్గర ఉన్నాడని చెప్పడంతో, హరిలాల్ వెంటనే తన మోటార్ సైకిల్‌పై దర్గాకు వెళ్ళాడు. అక్కడ బుగ్గప్ప కనిపించగానే, అతనిపై రాములు గౌడ్ ఫిర్యాదు చేశాడని చెప్పి, అతన్ని తన మోటార్ సైకిల్‌పై కూర్చోబెట్టుకుని కోడంగల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతుండగా, జుంటుపల్లి గేటు దాటిన తర్వాత మధ్యాహ్నం సుమారు 03:30 గంటల సమయంలో, రాములు గౌడ్, రాములు గౌడ్ తమ్ముడు, పకీరప్ప మరియు ఉప సర్పంచ్ నర్సప్పతో పాటు మరో ఇద్దరు రెండు మోటార్ సైకిళ్లపై మరియు ఒక స్కూటర్‌పై హఠాత్తుగా వచ్చి హరిలాల్‌ను అడ్డుకున్నారు. హరిలాల్ కొద్దిగా బైక్‌ను ఆపగానే, రాములు గౌడ్ వెనుక కూర్చున్న బుగ్గప్ప చొక్కా కాలర్ పట్టుకుని కిందకు లాగాడు. వెంటనే ఇద్దరూ మోటార్ సైకిల్ నుండి కింద పడిపోయారు. రాములు గౌడ్‌తో పాటు ఉన్న మిగతా ఐదుగురు గుంపుగా చేరి బుగ్గప్పపై దాడి చేస్తుండగా, హరిలాల్ వారిని విడిపించడానికి ప్రయత్నించాడు. అప్పుడు రాములు గౌడ్ తన వెంట తెచ్చుకున్న వేట కొడవలితో బుగ్గప్ప తలపై బలంగా నరికాడు. బుగ్గప్ప రోడ్డుపై పడిపోగానే, రాములు గౌడ్ తమ్ముడు (లక్ష్మయ్య గౌడ్) తన అన్న దగ్గర నుండి వేట కొడవలిని తీసుకుని బుగ్గప్ప తల మరియు ఇతర శరీర భాగాలపై నరికాడు. మిగిలిన వారు బుగ్గప్పపై పడి చేతులతో కొడుతూ, కాళ్ళతో ఇష్టం వచ్చినట్లు తన్నారు. ఆ దెబ్బలకు బుగ్గప్ప అక్కడికక్కడే మరణించాడు. అనంతరం వారు తమ మోటార్ సైకిళ్లపై ఎర్రన్ పల్లి గ్రామం వైపు పారిపోయారు. వెంటనే హరిలాల్ ఈ విషయాన్ని తన ఎస్సై  ఫోన్ ద్వారా తెలియజేశాడు. నిందితులను చూస్తే గుర్తు పట్టగలనని హరిలాల్ యాలాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.వెంటనే యాలాల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 52/2015, U/sec 302, 353 R/w 34 IPC సెక్షన్ల క్రింద అప్పటి యాలాల్ ఎస్‌ఐ రవి కుమార్ కేసు నమోదు చేయగా, అప్పటి కరణ్‌కోట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. శివ శంకర్ కేసును దర్యాప్తు చేసి గౌరవ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. వాదోపవాదనలు విన్న గౌరవ డిస్ట్రిక్ట్ & సెషన్స్ జడ్జి శ్రీ డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి గారు ఈ రోజు నిందితులు ఏ1) ఈడిగి రాములు గౌడ్ మరియు ఏ2) ఈడిగి లక్ష్మయ్య గౌడ్‌లకు జీవిత ఖైదు మరియు ఒక్కొక్కరికి ₹1000/- జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినారు అని జిల్లా ఎస్పీ తెలిపారు.ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నారాయణ గౌడ్, వి. రవి కుమార్, సుధాకర్ రెడ్డి లకు, దర్యాప్తు అధికారులు అప్పటి యాలాల్ ఎస్సై  రవికుమార్, అప్పటి కరణ్‌కోట్ ఇన్స్పెక్టర్ కె. శివ శంకర్, ప్రస్తుత కరణ్‌కోట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నగేష్, యాలాల్ ఎస్సై గిరన్న, సి డి ఓ లు   జి. శ్రీశైలం, ఎం. శ్రీనివాస్ మరియు బ్రీఫింగ్ అధికారులు బి. వీరన్న గార్లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే జారే మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే జారే
లోకల్ గైడ్ అశ్వారావుపేట : ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మున్సిపాలిటీ...
హత్యా కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు
ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకల సౌకర్యం తో జనరల్ ఆసుపత్రి ప్రారంభం
ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి సీతక్క, ట్రై కార్ చైర్మన్ బేల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఎస్ టి ఎమ్మెల్యేల సమావేశం పార్టీలకు అతీతంగా హాజరైన st mla లు
రేపు పెంజర్ల లో అనంత పద్మనాభుడి కళ్యాణ మహోత్సవం