నిరుపేదలకు "బిగ్ రిలీఫ్"..!
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఆరోగ్య విషయంలో నిరుపేదలకు బిగ్ రిలీఫ్ లభిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. నందిగామ మండలం అప్పారెడ్డి గూడ గ్రామానికి చెందిన చిన్నంతర గారి అఖిలేశ్వరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బుధవారం ఎమ్మెల్యే క్యాపు కార్యాలయంలో అందజేశారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, కొత్తూరు నందిగామ ఉమ్మడి మండలాల ఎంపీపీ శివశంకర్ గౌడ్, మర్డర్ కమిటీ డైరెక్టర్ మల్లేష్, మాజీ ఉపసర్పంచ్ సీతారాం, కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కుమార్ గౌడ్, మైనార్టీ నేత మహమ్మద్ ఇబ్రహీం, రాజు, శ్రీహరి గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు బిగ్ రిలీఫ్ లాంటిదని అన్నారు. సాయంత్రం మరింత మందికి సీఎం రిలీఫ్ ఫండ్ తదితర సంక్షేమాలకు సంబంధించిన చెక్కులను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు
Comment List