స్టార్స్ సొసైటీ డిపాజిట్ మెచ్యూరిటీ చెల్లింపుల్లో జాప్యం - ఆందోళ‌న‌లో డిపాజిట‌ర్లు

స్టార్స్ సొసైటీ డిపాజిట్ మెచ్యూరిటీ చెల్లింపుల్లో జాప్యం - ఆందోళ‌న‌లో డిపాజిట‌ర్లు

సొసైటీ చెల్లింపులు లేక ఆగిపోయిన‌ కోట్ల రూపాయ‌లు

కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్న డిపాజిట్ దారులు 

మూతప‌డుతున్న ప‌లు సొసైటీ ఆఫీసులు 

స‌హారా అనుబంధ సంస్థ‌గా ప్ర‌చారం చేసి డిపాజిట్లు సేక‌రించిన ఏజెంట్లు

20వ తేదీన ఆందోళ‌న చేయ‌నున్న డిపాజిట‌ర్లు 


హైద‌రాబాద్, లోక‌ల్ గైడ్: 
కాయ‌కష్టం చేసి, క‌ష్ట‌ప‌డి చెమ‌టోడ్చి సంపాదించిన కార్మికుల సొమ్ము, బూర్ర‌లు ఖ‌రాబు చేసుకుని దాచుకున్న‌ ఉద్యోగుల డిపాజిట్ల డ‌బ్బుల‌కు సొసైటీ నుంచి మెచ్యూరిటీ చెల్లింపులు లేక డిపాజిట్ దారులు ఆందోళ‌న గురౌవుతున్నారు. డిపాజిట్ల కాల‌ప‌రిమితి ముగిసినా డ‌బ్బులు రెండింత‌లు రావాల్సి ఉన్నా... మెచ్యూరిటీలు జ‌ర‌గ‌డం లేదు. ఇదిలా ఉంటే... స‌హారా అనుబంధ సంస్థ అంటూ స్టార్స్ మ‌ల్టీప‌ర్ప‌స్ కో ఆప‌రేటివ్ సొసైటీ లిమిటెడ్, సైఫాబాద్ ఆడ్రాస్ పేరుతో రిజిస్ట‌ర్డ్ అయిన సంస్థ తెలంగాణ‌లోని ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల్, క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి, హైద‌రాబాద్ తో మ‌రికొన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయ‌ల‌ను డిపాజిట్లు గా సేకరించారు ఏజెంట్లు. ఇక స‌హారాకు సంబంధించిన కేసు విష‌యానికి వ‌స్తే... జూన్ 2012లో... ప్ర‌జ‌ల వ‌ద్ద నుంచి సెబీ నిబంధ‌న‌ల‌ను పాటించ‌కుండా ఓఎఫ్సీడీ ద్వారా డ‌బ్బులు డిపాజిట్లు సేక‌రించే హ‌క్కు లేద‌ని సుప్రీంకోర్టుకు సెబీ తెలిపింది. అప్ప‌టి నుంచి స‌హారా డిపాజిట్ దారుల్లో అల‌జ‌డి మొదలైంది. డిపాజిటర్లు ఆందోళ‌న బాట ప‌ట్టారు. స‌హారా అనుబంధ క్రెడిట్ సొసైటీల నిధుల స‌మీక‌ర‌ణ దాదాపు ఆగిపోయింది. తిరిగి 2021 జ‌న‌వ‌రిలో సహారా క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ మరియు సహారైన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. 
    ఇదిలా ఉంటే... 2017, 2018 సంవ‌త్స‌రాల్లో మంద‌మ‌ర్రి సెక్టార్ ప‌రిధిలో స‌హారా గ్రూప్ అనుబంధ సంస్థ అంటూ...  స్టార్స్ మ‌ల్టీప‌ర్ప‌స్ కో ఆప‌రేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో పెద్ద ఎత్తున డిపాజిట్ల‌ను సేకరించారు సొసైటీ ఏజెంట్లు. అయితే స‌హారా అనుబంధ కో ఆప‌రేటివ్ సొసైటీ అంటూ ఎజెంట్లు ప్ర‌చారం చేస్తూ... నిధుల స‌మీక‌ర‌ణ చేశారు. జూన్ 13, 2018 నుంచి ఓ కుటుంబం సుమారు 5ల‌క్ష‌ల రూపాయ‌ల డిపాజిట్ల‌ను వేర్వేరు నెల‌ల్లో సేక‌రించారు ఈ సొసైటీ ఏజెంట్లు. జూన్ 13, 2024కు డిపాజిట్ గ‌డువు ముగిసింది. ఇప్పుడు మ‌ళ్లీ ఏడాది గ‌డుస్తోంది. సంబ‌ధిత సొసైటీ మంద‌మ‌ర్రి సెక్టార్ కార్యాల‌యానికి డిపాజిట్ దారులు వెళ్తే స‌రియైన స‌మాధానం చెప్పేవారు లేరు. డిపాజిట్ ఎమౌంట్ మెచ్యూరిటీ జ‌ర‌గాలంటే హెడ్ ఆఫీసు నుంచి రావాల‌ని డిపాజిట్ దారుల‌ను దాట‌వేసే స‌మాధ‌నం చెబుతున్నారు  ఆ సెక్టార్ కార్యాల‌య ఉద్యోగులు. బాగా గ‌ట్టిగా నిల‌దిస్తే... కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని, మీకు ఏదైన వివ‌రాలు కావాలంటే హైద‌రాబాద్ లోని కార్యాల‌యంలో సంప్ర‌దించాల‌ని త‌ప్పించుకుంటున్నారు సొసైటీ కార్యాల‌య ఉద్యోగులు. 
   హైద‌రాబాద్ కార్యాల‌యానికి సంబంధించిన సొసైటీ ముఖ్య ప్ర‌తినిధులను మీడియా సంప్ర‌దిస్తే... సుప్రీం కోర్టు, సెబీ గైడ్ లైన్స్ గురించి చెబుతూ... ఆన్ లైన్ లో డిపాజిట్ దారులు మెచ్యూరిటీ గురించి అప్లాయి చేసుకోవాల‌ని చెబుతున్నారు. అయితే సెబీ డైరెక్ష‌న్ ప్ర‌కారం మొద‌ట 50 వేల డిపాజిట్ల మెచ్యూరిటీని, త‌ర్వాత ల‌క్ష రూపాయ‌ల డిపాజిట్ల అమౌంట్ల మెచ్యూరిటీని చేస్తున్నార‌ని సొసైటీ ప్ర‌తినిధులు చెబుతున్నారు. ఇక‌నుంచి ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ల మెచ్యూరిటీని కూడా ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసి పొంద‌వ‌చ్చు అని అంటున్నారు. 
   కానీ క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కొంద‌రి డిపాజిట్ల కాల‌ప‌రిమితి ముగిసి మూడు నాలుగేళ్లు గ‌డుస్తోంది. మ‌రికొంత‌మంది ఏడాది గ‌డిచిపోయింది. డిపాజిట్ దారులు ఏజెంట్ల‌ను డ‌బ్బులు అడిగితే... మాకు సంబంధం లేదు అని చెబుతున్నార‌ని డిపాజిట్ దారులు వాపోతున్నారు. ఇక ఏకంగా స్టార్స్ మ‌ల్టీప‌ర్ప‌స్ కో ఆప‌రేటివ్ సొసైటీ కార్యాల‌యానికి వెళితే స‌రిగా రెస్పాన్స్ లేదు. ఆఫీసుల చుట్టూ తిరిగి అల‌సిపోతున్నామ‌ని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అంతే కాదు.. ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నే విష‌యాన్ని కూడా చెప్ప‌డం లేదు. దీంతో ఆన్ లైన్ లో దార‌ఖాస్తు చేసుకోవాల‌నే విష‌యం డిపాజిట్ దారుల‌కు తెలియ‌దు. ఆన్ లైన్ లో కొంత మంది దర‌ఖాస్తు చేసుకున్న మెచ్యూరిటీ డ‌బ్బులు స‌మ‌యానికి రావ‌డం లేదు. ఫ‌లితంగా వాళ్లు ఇత‌రులు క‌ట్టుకోవాల్సిన బాకీలు, నిర్దేశించుకున్న కార్యక్ర‌మాలు, పెళ్లీల్లు వాయిదా ప‌డుతున్నాయ‌ని  ఘోస‌వెళ్ల‌గ‌క్కుతున్నారు డిపాజిట్ దారులు. 
    తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలలో చాలా ప‌ట్ట‌ణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఒక‌వైపు సుప్రీం కోర్టులో కేసు, సెబీ నిబంధ‌న‌లు ఉన్న స‌మ‌యంలో కూడా ప్ర‌జ‌ల‌కు మాయా మాటాలు చెప్పి స్టార్స్ మ‌ల్టీప‌ర్ప‌స్ కో ఆప‌రేటివ్ సొసైటీ లిమిటెడ్ ఎజెంట్లు డిపాజిట్లు సేక‌రించారు అని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కాల‌ప‌రిమితి ముగిసిన త‌ర్వాత రెంటిపు రావాల్సిన డ‌బ్బులు రాక తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నామ‌ని ఆవేద‌న చెందుతున్నారు బాధితులు. తెలంగాణ‌లో ఇంకా స‌హారా అనుబంధ‌ సొసైటీల‌ బాధితుల క‌ష్టాలు అన్నిఇన్నీకావు. ల‌క్ష‌ల డిపాజిట్లు చేసిన డిపాజిట్ దారుల డ‌బ్బులు తిరిగి చెల్లింపులు జ‌ర‌గక‌పోవ‌డంతో డిపాజిట్ దారులు ఆందోళ‌న బాట ప‌ట్ట‌నున్నారు. ఈ నెల 20వ తేదీన హైద‌రాబాద్ లో ఆందోళ‌న చేయాల‌ని యోచిస్తున్న‌ట్లు బాధితులు చెబుతున్నారు. వంద‌ల కుటుంబాలు కోట్ల రూపాయ‌ల‌ను డిపాజిట్లు చేశాయ‌ని బాధితులు అంటున్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వం ప‌ట్టించుకుని త‌మ‌కు న్యాయం జ‌రిగేలా చూడాల‌ని కోరుతున్నారు డిపాజిట‌ర్లు. 

 

స‌హారా క్రెడిట్ సొసైటీ సంబంధించిన ముఖ్యంశాలు

1. జూన్ 2012 - మార్కెట్ నియంత్రణ సంస్థ - SEBI నిబంధనలను పాటించకుండా OFCD ద్వారా పెట్టుబడిదారుల నుండి రూ. 27,000 కోట్లు సమీకరించే హక్కు సహారా ఇండియా పరివార్ రియల్ ఎస్టేట్ విభాగానికి లేదని SEBI సుప్రీంకోర్టుకు తెలిపింది.
2. ఆగస్టు 2012 - సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SIRECL) అండ్ సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (SHICL) లు తమ పెట్టుబడిదారులకు రూ. 24,400 కోట్లకు పైగా తిరిగి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
3. ఫిబ్రవరి 2014 - సుప్రీంకోర్టు ముందు హాజరు కాకపోవడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు రాయ్‌ను అరెస్టు చేశారు.
4. మార్చి 2014 - సహారాకు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లతో పాటు రాయ్‌ను తీహార్ జైలుకు పంపారు.
5. మార్చి 2015 - సహారా నుండి మొత్తం బకాయిలు వడ్డీతో కలిపి రూ. 40,000 కోట్లకు పెరిగాయని సుప్రీంకోర్టు పేర్కొంది. 
6. జూలై 2015 - సహారా మ్యూచువల్ ఫండ్ వ్యాపార లైసెన్స్‌ను సెబీ రద్దు చేసింది.
7. మే 2016 - రాయ్ తీహార్ జైలు నుండి పెరోల్‌పై విడుదలయ్యాడు.
8. జనవరి 2021- సహారా క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ మరియు సహారైన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ తమ కార్యకలాపాలను కొనసాగించడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. కానీ సహకార సంఘాల కేంద్ర రిజిస్ట్రార్ అండ్  వ్యవసాయం, సహకారం, రైతు సంక్షేమ శాఖ ఆదేశాలను నిలిపివేసింది. 
సహారా గ్రూప్‌కు ఉపశమనం ఇస్తూ , డివిజనల్ బెంచ్ ఇప్పటికే రూ. 17,487.82 కోట్ల చెల్లింపు జరిగిందని కూడా గుర్తించింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 హృతిక్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం మరచిపోలేనిది: అయాన్ హృతిక్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం మరచిపోలేనిది: అయాన్
సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘వార్ 2’ (WAR 2) ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan)...
భూసేకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
 ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కన్సల్టేటివ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఎంపీ డీకే అరుణ‌
మ‌హిళ‌ల హ‌క్కుల్లో ప్ర‌సూతి సెల‌వులు కీల‌కం!
ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి గట్టి కౌంటర్‌గా నిలిచింది:  కేంద్ర హోం మంత్రి అమిత్ షా
రేప‌టి నుంచి  హైదరాబాద్ మెట్రో ఛార్జీల త‌గ్గింపు...
బిర్యాని తింటున్నార అయితే ఇవి తెలుసుకోండి .....