విపత్తు నష్ట నివారణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక చేయాలి... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలి.

విపత్తు నష్ట నివారణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక చేయాలి... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

విపత్తు నిర్వహణపై పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్.

ఖమ్మం- (లోకల్ గైడ్)

విపత్తుతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి, విపత్తు నిర్వహణపై రెవెన్యూ, ఇర్రిగేషన్, పంచాయతీ రాజ్, మునిసిపల్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే వర్షాకాలంలో భారీ వర్షాలు, వరదల పట్ల ముందస్తు సన్నద్ధతపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విపత్తుల పట్ల ముందస్తు ఏర్పాట్లతో అధికారులు హెడ్ క్వార్టర్స్ లో ఉంటూ, సన్నద్ధంగా ఉండాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రజలకు కష్టం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. వర్షాలు వచ్చినప్పుడు ముంపు ప్రాంతాలు, ప్రమాదకర నీటి వనరుల పట్ల ముందస్తుగా మ్యాపింగ్ చేసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండల,మునిసిపాలిటీ స్థాయిలో వారి, వారి పరిధిలో ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయో గుర్తించి, వాటిని సరిదిద్దాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉన్న వారిని ముందురోజు సురక్షిత ప్రాంతానికి చేర్చాలని, ఇందుకు ప్రతి గ్రామంలో ఒక భవనాన్ని గుర్తించి సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రతి మురికికాల్వను ప్రారంభం నుండి తుది వరకు పరిశీలించి, పడ్డ వర్షం బయటకు వెళ్తుందా చూడాలని, ప్రతి మురికికాల్వకు డిసిల్టింగ్ చేసి, ఎక్కడా నీరు ఆగకుండా వుండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆపద మిత్ర క్రింద యువతి, యువకులను గుర్తించి విపత్తు నిర్వహణపై శిక్షణ ఇచ్చినట్లు, జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 139, పట్టణ ప్రాంతాల్లో 161 మంది యువతను ఆపద మిత్ర క్రింద ఎంపిక చేసి 10 రోజుల క్లాస్ రూమ్ శిక్షణ, క్షేత్ర శిక్షణ ఇచ్చి, వైద్య పరీక్షలు చేపట్టి వారికి ఫిట్ నెస్ పరీక్షలు చేసి, జీవిత భీమ చేయించినట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుండిఅధికారులు, ఆపదమిత్ర, ఫిషర్ మెన్, ఈతగాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటుచేసి సమాచారం అందిపుచ్చుకొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామం/వార్డు లో పొర్టబుల్ మైక్ సెట్ సిద్ధం చేసుకోవాలని, విపత్తు సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి వినియోగించేలా ఉంచాలని అన్నారు. ఇది వరకే మైక్ సెట్ ఉన్నచోట, వాటి పనితీరు చూసి, బ్యాటరీ, ప్రత్యామ్నాయ పవర్ సప్లయ్ కి చర్యలు చేపట్టి, ఉపయోగానికి సిద్ధం చేయాలన్నారు. పారిశుద్ధ్య వాహనాల లో సైతం రికార్డు సమాచారం ప్రచారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.గ్రామం/వార్డ్ వారీగా ప్రభావిత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలింపుకు పునరావాస కేంద్రాల గుర్తింపు చేసి, కావాల్సిన దుప్పట్లు, తదితర సామాగ్రి సిద్ధం చేయాలన్నారు. ప్రతివారం ఆయా సామాగ్రి పరిస్థితిని తనిఖీ చేయాలని, పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 
ముఖ్యమైన డాక్యుమెంట్లు, విలువైన సామాగ్రిని 15 జూన్ నుండే ప్యాకింగ్ చేసుకొని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే తరలింపుకు సిద్ధంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రమాదకర మేజర్ రోడ్లను ముందస్తుగా ఆర్టీసీ బస్సులతో బ్లాక్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, పర్యాటకులను ప్రమాదకర ప్రదేశాల్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామం, మండల వారీగా అనుభవజ్ఞులైన ఫిషర్ మెన్, గజ ఈతగాళ్ల జాబితా ఇవ్వాలని, వీరికి గల పడవలు, తెప్పల వివరాలు పొందుపర్చాలని కలెక్టర్ అన్నారు. విపత్తులను ఎదుర్కోవడానికి జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు వీరిని తహశీల్దార్ల ఆధీనంలో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలను కలెక్టరేట్ వద్ద సిద్ధంగా ఉంచాలన్నారు. టూరిజం, ఫిషర్ మెన్ ల వద్ద గల పడవలకు తనిఖీలు చేసి, ఇంధనంతో అన్ని రకాలుగా సిద్ధపర్చాలనీ అన్నారు.
విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండి ముంపు ప్రాంతాల్లో ఉన్న మేజర్ టవర్ లకు ఏమైనా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నచోట ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.జిల్లా కేంద్రాల్లో 1077 నెంబర్ తో కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని, ఇందుకై సమర్థ సూపరింటెండెంట్ ని బాధ్యునిగా చేసి, కావాల్సిన అధికారులను  నియమించాలన్నారు. మండల కేంద్రాల్లో ల్యాండ్ లైన్ ఫోన్లను క్రియాశీలం చేసి, కంట్రోల్ రూం ల ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, గత అనుభవం దృష్ట్యా ఏం జరిగింది, ఏం చేసాం, ఏం చేయాలనే ఆలోచన చేయాలన్నారు. ప్రతి శాఖ నుండి విపత్తు నిర్వహణకు ఒక నోడల్ అధికారిని నియమించాలన్నారు. స్థానిక అధికారులు, నాయకులకు అవగాహన కల్పించి, అత్యవసర సమయాల్లో ప్రజలకు చేసే సేవల్లో అంతరాయం కలగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. పోలీస్ శాఖ నుండి విపత్తు ఎదుర్కోవడానికి టీములను సిద్దం చేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. పోయిన సంవత్సరం ఉహించకుండా వరదలు వచ్చాయని, ఈసారి ముందస్తుగా పటిష్ట కార్యాచరణతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పోలీసు కమీషనర్ అన్నారు.సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ, డిఆర్ఎఫ్ టీములను డివిజన్ల వారిగా విభజించి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. నాలా/డ్రెయిన్ల క్లియర్ కు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గత వరదల నుండి ఎంతో నేర్చుకున్నట్లు, నష్టం జరగకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టనున్నట్లు తెలిపారు.సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ, శిధిలావస్థలో ఉన్న అంగన్వాడీ, ప్రభుత్వ భవనాలను గుర్తించి, ప్రత్యామ్నాయ భవనాల్లోకి ముందస్తుగా మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కంప్యూటర్లు, విలువైన సామాగ్రి, రికార్డు పాడవకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అన్నారు. విలువైన అసెట్స్ ను గుర్తించి అవగాహన కల్పించి, వాహనాలకు లాగా భీమా చేయించడానికి చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన చోట ఇన్సూరెన్స్ శిబిరాలు నిర్వహించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ నీటి వనరుల తనిఖీలు చేపట్టి, వాటి కాల్వలు, కట్టల పటిష్టతను చూడాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

విపత్తు నష్ట నివారణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక చేయాలి... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. విపత్తు నష్ట నివారణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక చేయాలి... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.
విపత్తు నిర్వహణపై పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్.
రాజ్ భవన్లో మహారాష్ట్ర  గుజరాత్ ఫౌండేషన్ డే వేడుకలకు తెలంగాణ గవర్నర్, శ్రీ జిష్ను దేవ్ వర్మ
ఎంపీ వద్దిరాజుకు ఆహ్వానo
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం 
ఘనంగా మేడే వేడుకలు 
తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ.