"హలో మాస్టర్, కెమెరా కొంచెం రైట్ టర్న్ ఇచ్చుకోండి.. సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం!"
లోకల్ గైడ్ : టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా, గత ఉగాది పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది.ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరు అయిన శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నాడు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో హీరోయిన్‌గా తమిళ లేడీ సూపర్‌స్టార్ నయనతార ఎంపికయ్యారు. తాజాగా చిత్రబృందం "హలో మాస్టర్, కెమెరా కొంచెం రైట్ టర్న్ ఇచ్చుకోండి.. సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం!" అంటూ ఒక వీడియోను విడుదల చేశారు.
ఈ సినిమా షూటింగ్‌ను మే 22 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా సెకండ్ హాఫ్ స్క్రిప్ట్‌ను వైజాగ్‌లో సిద్ధం చేస్తున్నాడు.
ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. హీరోయిన్ నయనతారతో పాటు, క్యాథరిన్ థెరిసా కూడా ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఇక సీనియర్ నటుడు వెంకటేష్ ఒక గెస్ట్ రోల్‌లో కనిపించనున్నట్టు సమాచారం.ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comment List