తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుండి థియేట‌ర్లు బంద్ ఎందుకో తెలుసా...

 తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుండి థియేట‌ర్లు బంద్ ఎందుకో తెలుసా...

లోక‌ల్ గైడ్:
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుండి థియేటర్లను మూసివేయాలని సినీ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సినిమాలను అద్దె (రెంటల్) విధానంలో ప్రదర్శించడం సాధ్యపడడం లేదని, తమకు పర్సంటేజ్ ఆధారంగా చెల్లింపులు చేయాల్సిందేనని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశానికి నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు‌తో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. చాలా కాలంగా పర్సంటేజ్ పద్దతిపై ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఒకవైపు ఎగ్జిబిటర్లు అద్దె విధానంలో సినిమాలను ప్రదర్శించడం అసాధ్యమని చెబుతుండగా, మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు పర్సంటేజీ పద్దతిని అంగీకరించలేమని చెబుతున్నారు. ఈ పరిస్థితి నిర్మాతలకు పెద్దసభగా మారింది.ఈ నేపథ్యంలో, ఎగ్జిబిటర్ల జాయింట్ మీటింగ్‌లో పర్సంటేజ్ విధానం, ప్రభుత్వ విధానాలపై చర్చించగా, నిర్మాతలకు ఈ విషయంలో స్పష్టతనిచ్చేలా ఒక లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు.

 

 

 

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి 
కరీంనగర్ : లోకల్ గైడ్:వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...
సబ్సిడీ జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి 
జాతీయ రక్షణ నిధికి లక్ష రూపాయల విరాళం
ప్రజా ఫిర్యాదుల పరిష్కారం పై శ్రద్ధ వహించండి
జీలుగు విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి    
గణంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి. 
తొర్రురులో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం