రైల్వే స్టేష‌న్ల‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ.....

 రైల్వే స్టేష‌న్ల‌ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ.....

లోక‌ల్ గైడ్ :
బికనీర్ / రాజస్థాన్: రాజస్థాన్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ్‌నోక్ రైల్వే స్టేషన్ నుంచి 18 రాష్ట్రాల్లో ఆధునీకరించిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ప్రధాని మోదీ బికనీర్‌లోని ప్రసిద్ధ కర్ణిమాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు ఆయనకు తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం ప్రధాని బికనీర్ ఎయిర్ బేస్‌ను కూడా పరిశీలించారు.పర్యటన చివరగా బికనీర్ సమీపంలోని పాలనా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఇక, ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని అనుసరిస్తూ భారత ప్రభుత్వం ప్రారంభించిన “ఆపరేషన్ సిందూర్” ద్వారా పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందారు.ఈ ఉగ్రదాడికి నెల రోజులకే ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని బికనీర్ ఎయిర్ బేస్‌ను సందర్శించడం విశేషం.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు
లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందడానికి మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులను కనుగొనండి. ఈ వస్తువులు మీ జీవితంలో శ్రేయస్సును ఎలా ఆకర్షిస్తాయో మరియు శుభ...
వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేసిన మోడీ
అర్హత కలిగిన పేద కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి
చేయూత పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలి.
శిల్పారామంలో ప్రపంచ సుంద‌రీమ‌ణుల సంద‌డి 
అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు