మెంతి ఆకులు – ఆరోగ్యానికి అద్భుతమైన వరం

మెంతి ఆకులు – ఆరోగ్యానికి అద్భుతమైన వరం

వంటింటిలో తరచూ ఉపయోగించే మెంతులు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, ఔషధ గుణాలు కలిగినవి. ఆయుర్వేదంలో మెంతులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇవి నీటిలో నానబెట్టి తినొచ్చు లేదా నీటిలో మరిగించి తాగొచ్చు. అలాగే మెంతి గింజల పేస్ట్‌ను తలకు, ముఖానికి కూడా వేస్తారు. అంతేకాక, మెంతి గింజలకే కాదు, మెంతి ఆకులకూ అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.కొంతమంది మెంతి ఆకులను కూరల్లో వేసి వాడుతారు, ఇది కూరకు మంచి రుచి, వాసనను ఇస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, మెంతి ఆకులను తరచూ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతుంది.

జీర్ణవ్యవస్థకు మేలు:

మెంతి ఆకుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవి పేగుల్లో మల కదలికలను సజావుగా ఉంచుతాయి. మెంతి ఆకులు కడుపులో మంచి బ్యాక్టీరియాలను పెంచి, అజీర్తి, కడుపు ఉబ్బరం, IBS (ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్) వంటి సమస్యలను తగ్గిస్తాయి. కడుపు నిండిన భావన కలగడం వల్ల తక్కువగా తినడం జరుగుతుంది, ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం మెంతి ఆకుల జ్యూస్ తాగడం కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడుతుంది.

డయాబెటిస్‌కి ప్రయోజనం:

మెంతులు షుగర్ నియంత్రణలో ఉపయోగపడతాయన్న విషయం తెలిసిందే. కానీ చేదుగా ఉండటం వల్ల కొందరికి తినలేరు. అలాంటి వారు మెంతి ఆకులను వాడవచ్చు. ఇవి కూడా కొంత చేదుగానే ఉన్నా, గింజలతో పోలిస్తే తక్కువ చేదుగా ఉంటాయి. మెంతి ఆకుల రసం తీసి తాగడం లేదా కూరలుగా వండుకొని తినడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్‌ను సమర్థవంతంగా పనిచేయేలా చేస్తాయి. దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు:

మెంతి ఆకుల్లో ఉన్న పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరచి బీపీని నియంత్రిస్తుంది. హైబీపీ ఉన్నవారు తరచూ ఈ ఆకులను తీసుకుంటే మంచిది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, కేన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు, దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి.

ఎలా తీసుకోవాలి?

మెంతి ఆకులను రోజూ ఒక కప్పు మోతాదులో ఉడికించి తినవచ్చు లేదా వాటి రసాన్ని తీసి తాగొచ్చు. ఇలా చేయడం ద్వారా శరీరానికి అనేక రకాల ఆరోగ్య లాభాలు లభిస్తాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News