ఉదయం టీ, కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగండి – ఆరోగ్యానికి అదనపు బోనస్!
ప్రతీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం చాలామందికి టీ లేదా కాఫీ తాగడం ఓ అలవాటు. కొన్ని గంటలకోసారి వీటిని తాగే వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. కానీ ఆరోగ్యపరంగా చూస్తే, టీ, కాఫీలకు బదులుగా ఒక చక్కటి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఆ ప్రత్యామ్నాయం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అదే గ్రీన్ టీ!
గ్రీన్ టీతో మీ ఉదయం ప్రారంభించండి
ఉదయం గ్రీన్ టీ తీసుకోవడం వలన శరీర మెటాబాలిజం వేగంగా పనిచేస్తుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి, కొవ్వు పేరుకోదు. ఇది బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారికి ఎంతో ఉపయోగపడుతుంది. గ్రీన్ టీలో ఉండే రహస్యమే ఇది!
యాంటీ ఆక్సిడెంట్ల పటాళం
గ్రీన్ టీలో అధికంగా ఉండే పాలిఫినాల్స్, కాటెకిన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నిర్వీర్యం చేస్తాయి. దీంతో కణాలు సురక్షితంగా ఉంటాయి. ఫలితంగా డయాబెటిస్, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరవు. అంతేకాక, రోగనిరోధకశక్తి మెరుగై దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.
మెదడు చురుకుగా.. జ్ఞాపకశక్తి బలంగా!
గ్రీన్ టీలో ఉండే తక్కువ మోతాదులో కెఫీన్, ఎల్-థియనైన్ అనే సమ్మేళనం మెదడును చురుకుగా ఉంచుతుంది. ఇది మీ ఏకాగ్రతను పెంచుతుంది, బద్దకాన్ని పోగొట్టి ఉత్సాహాన్ని నింపుతుంది. రోజంతా ఎనర్జీగా ఉండాలనుకుంటే, ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ సరిపోతుంది. అల్జీమర్స్ వంటి వృద్ధాప్య సంబంధిత వ్యాధుల నుంచి జాగ్రత్త పడటానికీ ఇది ఉపకరిస్తుంది.
గుండెకు గ్రీన్ గిఫ్ట్
గ్రీన్ టీ సేవించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగిస్తుంది. ఫలితంగా హార్ట్ అటాక్ వంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి మీను రక్షించగలదు. అదే విధంగా, షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలోనూ గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది.
చర్మానికి సహజ మెరుపు
గ్రీన్ టీ చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ముడతలు, మచ్చలు తగ్గించి, కాంతివంతమైన, మెరిసే చర్మాన్ని అందిస్తుంది. ఇది యవ్వనాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది.
తాగే తీరే కీలకం
గ్రీన్ టీని తాగేటప్పుడు దానిలో చక్కెరను కలపకుండా నేరుగా తాగాలి. అప్పుడు మాత్రమే దీని పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. గ్రీన్ టీ అనేది కేవలం ఓ పానీయం మాత్రమే కాదు. ఇది ఆరోగ్యానికి అందాలేర్పాటుగా పనిచేసే సహజ ఔషధం. ప్రతిరోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగితే, మీరు ఆరోగ్యంగా, చురుగ్గా, చక్కగా ఉండగలరు.
Comment List