నితిన్‌ కథానాయకుడిగా త‌మ్ముడు

నితిన్‌ కథానాయకుడిగా త‌మ్ముడు

లోక‌ల్ గైడ్ :
నితిన్‌ ప్రధాన పాత్రలో శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’ జూలై 4న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, జూన్ 11న సాయంత్రం 5 గంటలకు ‘తమ్ముడు’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్‌ అనౌన్స్‌మెంట్ వీడియోను వినోదాత్మకంగా రూపొందించారు. అందులో లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్‌, సప్తమి గౌడ, బేబీ శ్రీరామ్‌ ఆదిత్యలు ట్రైలర్ రిలీజ్‌కి తామే కారణమంటూ మాటల తూటాలు పేలుస్తుంటే, డైరెక్టర్ శ్రీరామ్‌ వేణు వచ్చి – ‘‘మీ సందేహాలన్నీ తొలగాలంటే ట్రైలర్ చూసేయండి..’’ అని చెబుతాడు.ఈ విధంగా చిత్రంపై ప్రేక్షకుల ఆసక్తిని మరింతగా పెంచేలా వీడియోను రూపొందించారు. ‘ఎంసీఏ’, ‘వకీల్‌సాబ్‌’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ, ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా నిర్వహణ కేవీ గుహన్‌, సంగీతం అజనీష్‌ లోకనాథ్ అందిస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News