బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి... 

బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి... 

 స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు.. 

నిజామాబాద్ (లోకల్ గైడ్): నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4.45 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకున్న జిల్లా పాలనాధికారికి అదనపు కలెక్టర్లు సాదరంగా స్వాగతం పలికారు. నేరుగా తన చాంబర్ కు చేరుకున్న కలెక్టర్ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో  తదితరులతో భేటీ అయ్యి జిల్లా స్థితిగతులు, స్థానిక పరిస్థితుల గురించి వారితో చర్చించారు. అంతకుముందు కొత్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా పాలనాధికారిని ఆయన ఛాంబర్ లో వివిధ శాఖల అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పరిచయం చేసుకున్నారు. అదనపు కలెక్టర్లతో పాటు ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్ కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం రెవంత్ రెడ్డి సర్కార్‌ తొలి గద్దర్ సినీ అవార్డులు అందించేందుకు సిద్ధం
2024 జనవరిలో సినీ పరిశ్రమకు సంబంధించిన నంది అవార్డులను రద్దు చేసి, బల్లాడీర్ గద్దర్ గారి పేరుతో ప్రతీ ఏటా ఆయన జయంతి సందర్భంగా గద్దర్ అవార్డులను...
మ‌రోసారి ఏఐజీ ఆసుప‌త్రికి మాజీ సీఎం కేసీఆర్
రేపటి నుండి కెనడాలో జీ7 సదస్సు.. హాజరుకానున్న ప్రధాని మోదీ
భారత్‌లో 7,400కు చేరిన కరోనా యాక్టివ్‌ కేసులు… 87కు చేరిన మరణాలు
రాత్రి పూట భోజ‌నం అనంత‌రం 10 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే.. ఇన్ని లాభాల.....
ఉప్పల్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 మ్యాచు!
కుమారుడి అడ్మీష‌న్ కోసం ఇక్రిశాట్‌కి వెళ్లిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌