మాల్దీవుల గ్లోబ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా క‌త్రినా కైఫ్

మాల్దీవుల గ్లోబ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా క‌త్రినా కైఫ్

పర్యాటకులకు మాల్దీవులు అందించే ఆనందం, ఉల్లాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నీలిరంగు సముద్ర తీరాలు, ప్రశాంతతతో కూడిన వాతావరణం అక్కడి ఆకర్షణగా నిలుస్తుంది. చాలామందికి జీవితంలో ఒక్కసారి అయినా మాల్దీవులను సందర్శించాలని కోరిక ఉండగా, కొందరైతే ఆ కలను సాకారం చేసుకుంటున్నారు.ఇప్పుడు మాల్దీవులను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలనే లక్ష్యంతో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ విషయాన్ని మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (MMPRC) అధికారికంగా ప్రకటించింది.ఈ సందర్భంగా స్పందించిన కత్రినా కైఫ్, “మాల్దీవులు సహజసిద్ధమైన అందాలతో ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానం. ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని అనుభవించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించేందుకు నా వంతు కృషి చేస్తాను,” అని పేర్కొన్నారు.ఇక మరోవైపు, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముఇజ్జు ఆహ్వానంతో భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై నెలలో మాల్దీవులకు పర్యటనకు వెళ్ళే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఇది ముఇజ్జు అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత మోదీ చేస్తున్న మొదటి అధికారిక పర్యటనగా ఉండవచ్చు.కత్రినా కైఫ్ అంబాసిడర్‌గా నియామకం, మోదీ పర్యటన అనే రెండు సంఘటనలు మాల్దీవులను గ్లోబల్ టూరిజం హబ్‌గా మరింత స్థిరంగా నిలిపే అవకాశముందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, గతంలో ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులు మాల్దీవుల పర్యటనలను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నంలో భాగంగా కత్రినాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లు సమాచారం.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సచిన్ బాటలో రుతురాజ్ గైక్వాడ్... సచిన్ బాటలో రుతురాజ్ గైక్వాడ్...
భారత యువ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియాలోకి అవకాశం లభించకపోవడంతో...
బీజేపీ ప్రభుత్వంలో అవినీతి రహిత పాలన 
మారెమ్మ అమ్మ  వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే 
 రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..? 
"సూర్య 46"
హైదరాబాద్ వాసులకు శుభవార్త!
రాష్ట్రంలో మళ్లీ కురుస్తున్న వానలు..