టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చినందుకు
-టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు
-ధన్యవాదాలు తెలియజేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి..జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ): టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సంధర్బంగా టిపిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలియజేసీన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, స్టాండింగ్ కమిటీ మెంబెర్ వి. జగదీశ్వర్ గౌడ్. మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేస్తానని తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, నాయకులను కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పునరంకితమవుతానని, కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచిన నమ్మకన్ని తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తానని, ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన ఈ అవకాశం నాలో బాధ్యతను, నిబద్ధతను మరింత పెంచాయని, కాంగ్రెస్ పార్టీ పురోగతి కోసం అలుపులేకుండా పనిచేసేలా నాలో ఉత్సాహం నింపినందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.
Comment List