చిరువ్యాపారులకు భరోసా ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గం

-కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి.. కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి

చిరువ్యాపారులకు భరోసా ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గం

మహేశ్వరం, (లోకల్ గైడ్ ): మహేశ్వరం నియోజకవర్గంలోని కొత్తపేట రైతుబజారులో రెండున్నర దశాబ్దాల నుంచి చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న తమకు అండగా ఉండాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కోరారు. రైతు బజారు ముందు సబ్ రోడ్డులో పెట్టుకుని కూరగాయలు, పండ్లు, చేపలు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులను ఖాళీ చేయాలని ట్రాఫిక్ పోలీసులు హుకూం జారీ చేశారు. 23ఏళ్ల నుండి అంగడితో అనుబంధం ఉందని, బండ్లు తీయించి తమ పొట్ట కొట్టవద్దని కేఎల్ఆర్ ను కలిశారు. వెంటనే స్పందించిన కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి చిరు వ్యాపారులకు భరోసా ఇచ్చారు. ట్రాఫిక్ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందు కు కృషి చేస్తానని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు. దీంతో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరగాయల అసోసియేషన్ సభ్యులు,  ప్రజలు, తదితరులు,  పాల్గొన్నారు,

Tags:

About The Author

Latest News

ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్..! ఏపీలో మరో 70 క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్..! ఏపీలో మరో 70 క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం
లోకల్ గైడ్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం మరో సదుపాయానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని అన్న క్యాంటీన్లను ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే...
ముంబై కే కాదు, తన గతానికి సెలవిచ్చిన పృథ్వీ షా..! దేశవాళీ నూతన ఆరంభం
విద్య కాదు.. వ్యధ అవుతోంది! స్కూల్ బ్యాగులపై జీవో 22 అమలు ఎందుకు లేదో ఎవరికీ అర్థం కావడం లేదు
"కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు: పోలీసులకు కేటీఆర్ హెచ్చరిక"
"సామాజిక మాధ్యమాలపై జాగ్రత్త పాటించండి: సీఎం రేవంత్ హెచ్చరిక"
రేవంత్‌కి కేటీఆర్ సవాల్: 72 గంటల్లో ఎదురొచ్చి తేల్చుకుందాం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్ రావు