ఎరుపు లేదా తెలుపు..? ఏ రంగు ఉల్లిపాయ తినితే ఆరోగ్యానికి ఎక్కువ మేలు?

ఎరుపు లేదా తెలుపు..? ఏ రంగు ఉల్లిపాయ తినితే ఆరోగ్యానికి ఎక్కువ మేలు?

ఉల్లిపాయలు మన రోజువారి వంటల్లో తప్పనిసరిగా ఉండే పదార్థం. ఎక్కువమంది వంటల్లోనూ, సలాడ్‌లలోనూ, మజ్జిగతో చేసే రైతాలోనూ పచ్చిగా కట్ చేసి ఉల్లిపాయలు వేస్తుంటారు. వీటిని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. మార్కెట్‌లో సాధారణంగా రెండు రకాల ఉల్లిపాయలు లభిస్తాయి – ఎరుపు ఉల్లిపాయలు మరియు తెలుపు ఉల్లిపాయలు. ఈ రెండు రకాలను చాలామంది వాడుతూ ఉంటారు. కానీ ఆరోగ్యపరంగా ఏ ఉల్లిపాయ రకం ఎక్కువ మేలు చేస్తుందో చాలామందికి తెలియదు. దీనిపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

ఎరుపు ఉల్లిపాయలు:

ఎరుపు ఉల్లిపాయల్లో ఆంథోసయనిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవే ఉల్లిపాయకు ఎరుపు రంగును ఇస్తాయి. బ్లూబెర్రీలు, బ్లాక్‌బెర్రీలు, ఎరుపు క్యాబేజీ వంటి పదార్థాల్లోనూ ఇవే ఉంటాయి.
ఆంథోసయనిన్స్:

  • గుండెకు రక్షణ కలిగిస్తాయి

  • కణాలు దెబ్బతినకుండా చూస్తాయి

  • క్యాన్సర్, గుండెపోటు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి

తెలుపు ఉల్లిపాయలు:

తెల్ల ఉల్లిపాయల్లో క్వర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ వైరల్ లక్షణాలతో ప్రసిద్ధి చెందింది.
క్వర్సెటిన్ వల్ల:

  • ఆర్థరైటిస్‌తో వచ్చే నొప్పులు తగ్గుతాయి

  • దగ్గు, జలుబు వంటి శ్వాస సంబంధిత సమస్యలకు ఉపశమనం లభిస్తుంది

  • రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

ఏవి తినాలి?

ఈ రెండు రకాల ఉల్లిపాయలు తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఒక్క రకం మీదే ఆధారపడటం కాకుండా రెండూ తినడమే ఉత్తమం. అందుబాటులో ఏ రకం ఉన్నా ఆ రకాన్ని వాడొచ్చు. ముఖ్యంగా పచ్చిగా తినడం వల్ల వాటిలో ఉండే పోషకాలు పూర్తిగా లభిస్తాయి. ఉల్లిపాయల్లో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు:

  • కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

  • రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగిస్తాయి

  • బీపీ, షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి

ఎరుపు, తెలుపు రెండూ మంచి లక్షణాలు కలిగినవే. గుండె ఆరోగ్యానికి ఎరుపు ఉల్లిపాయలు, శ్వాస సంబంధిత సమస్యలకు తెలుపు ఉల్లిపాయలు ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఇష్టపడే రకం అయినా సరే, ఉల్లిపాయలు ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి తప్పకుండా మేలు కలుగుతుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News