దంతాల నొప్పి – ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందడం ఎలా?
దంతాల నొప్పి అనేది చాలా మందికి తరచూ ఎదురయ్యే సమస్య. దానికి పలు కారణాలు ఉండవచ్చు – దంత క్షయం, చిగుళ్ల వ్యాధులు, విరిగిన దంతాలు లేదా ఇన్ఫెక్షన్ వంటివి. కొందరికి నొప్పి తేలికగా ఉంటే, మరికొందరికి అది భరించలేనంత తీవ్రమైనదిగా ఉంటుంది. అలాంటి సమయంలో తినే ఆహారాన్ని కూడా సహించలేక ఇబ్బంది పడతారు.
అయితే, సాధారణ దంత నొప్పి అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఉపశమనం పొందవచ్చు. కానీ నొప్పి దంత క్షయం, ఇన్ఫెక్షన్ లేదా విరిగిన దంతాల వలన వస్తే తప్పకుండా డెంటిస్ట్‌ను సంప్రదించాలి. ఇక్కడ కొన్ని ఉపయుక్తమైన ఇంటి చిట్కాలను చూద్దాం:
1. ఉప్పు నీళ్ల గార్గిల్:
అర టీస్పూన్ ఉప్పును ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి నోట్లో పెట్టుకుని పుక్కిలించి తుప్పాలి. రోజులో ఎక్కువసార్లు ఇలా చేస్తే నొప్పి తగ్గుతుంది. ఉప్పు నీళ్లు సహజమైన డిస్ఇన్‌ఫెక్టెంట్‌గా పనిచేస్తాయి. ఇది దంతాల మధ్య చిక్కిన ఆహారపు అవశేషాలను తొలగించి వాపును తగ్గిస్తుంది.
2. కోల్డ్ ప్యాక్:
ఐస్ క్యూబ్స్‌ను శుభ్రంగా ఒక గుడ్డలో చుట్టి నొప్పి ఉన్న ప్రదేశం మీద, ముఖ్యంగా బుగ్గ లేదా దవడపై 15-20 నిమిషాలు ఉంచాలి. రోజులో కొన్ని సార్లు ఇలా చేస్తే నొప్పి ఉపశమనమవుతుంది. చలివలన రక్తనాళాలు కుదించుకొని వాపు తగ్గుతుంది.
3. లవంగాలు లేదా లవంగ నూనె:
లవంగ నూనెను కొన్ని చుక్కలు కాటన్ బాల్‌పై వేసి నొప్పి ఉన్న దంతంపై ఉంచాలి. లేకపోతే నేరుగా 1–2 లవంగాలను అక్కడ ఉంచి కొద్దిగా కొరక్కొచ్చును. లవంగాల్లో ఉండే యూజినాల్ అనే పదార్థం వలన నొప్పి, వాపు తగ్గుతాయి. ఇది ఒక సహజ అనస్థెటిక్ మరియు యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది.
4. వెల్లుల్లి:
ఒక వెల్లుల్లి రెబ్బను మెత్తగా చేసి, కొద్దిగా ఉప్పు కలిపి నొప్పి ఉన్న దంతంపై అప్లై చేయాలి. కొన్ని నిమిషాల తర్వాత నోటిని శుభ్రం చేయాలి. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు బాక్టీరియాను నాశనం చేసి వాపును తగ్గిస్తాయి.
5. పెప్పర్‌మింట్ టీ బ్యాగ్:
ఉపయోగించిన టీ బ్యాగ్‌ను చల్లారిన తర్వాత దంతంపై 20 నిమిషాల పాటు ఉంచాలి. పెప్పర్‌మింట్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.
ఈ ఇంటి చిట్కాలు తాత్కాలిక ఉపశమనానికి ఉపయుక్తంగా ఉంటాయి. కానీ నొప్పి కొనసాగితే లేదా తీవ్రమైతే తప్పకుండా దంత వైద్యుడిని కలవాలి.
Comment List