తెలంగాణకు ఐదు రోజుల పాటు వర్షాలు
By Ram Reddy
On
నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తూ తెలంగాణలో వర్షాలను జోరుగా కొనసాగిస్తున్నాయి. రుతుపవనాల చురుకైన కదలికల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు సూచించారు.ఇందులో భాగంగా ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడనుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Jun 2025 18:33:55
స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు..
Comment List