ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకల సౌకర్యం తో జనరల్ ఆసుపత్రి ప్రారంభం

వైద్యాధికారులు బాధ్యతాయుతంగా, సేవా దృక్పథంతో పని చేయాలి - ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి - నూతనంగా మంజూరైన వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగవంతం పూర్తి చేయాలి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ

ప్రభుత్వ ఆసుపత్రిలో  300 పడకల సౌకర్యం తో జనరల్ ఆసుపత్రి  ప్రారంభం

   
 వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్:
సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ కాలనీ సమీపంలో 30 కోట్ల నిధుల వ్యయంతో  నిర్మించిన 300  పడకల సౌకర్యం తో కూడిన ప్రభుత్వ జనరల్   ఆసుపత్రిని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి, శాసన సభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లతో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభం చేశారు. 

       అనంతరం కలెక్టరేట్  లోని సమావేశ మందిరంలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రుల,  వైద్య కళాశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు, బ్లడ్ బ్యాంక్,  వైద్యుల విధుల నిర్వహణ తదితర అంశాలపై వైద్య అధికారులతో మంత్రి సమీక్షించారు.  ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ... జనాభా ప్రాతిపదికన, ప్రజలకు దూరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు.   అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పునఃపరిశీలించి  రోడ్డు భద్రత సమావేశాలను నిర్వహించి బ్లాక్ స్పార్ట్  లను గుర్తించాలని కలెక్టర్ కు మంత్రి సూచించారు. ప్రమాదాలు సంభవించిన క్రమంలో సత్వర  వైద్య సేవలు అందించేందుకు ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఒక్కో దానికి 5.5 కోట్ల నిధులను కేటాయించడం జరుగుతుందని మంత్రి తెలిపారు.  ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తెలిపారు.  డీఎం హెచ్ఓ, సూపరింటెండెంట్  లు జావాబుదారితనంతో ఉండాలని మంత్రి తెలిపారు.  ఆసుపత్రుల్లో సంబంధిత అధికారులు అందుబాటులో లేకుంటే ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని మంత్రి తెలిపారు. 

జిల్లాలోని ప్రభుత్వేతర ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య పరమైన నిబంధనలకు అనుగుణంగా నడపాలని మంత్రి తెలిపారు. 

       నూతనంగా మంజూరైన వైద్య కళాశాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  అధ్యాపకులు, విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రాధాన్యత క్రమంలో వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న వైద్య కళాశాల, వసతి గృహాలకు సంబంధించి అత్యవసర మరమ్మత్తుల పనులను వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో  డీఎంఇ డాక్టర్ నరెంద్ర కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమీషనర్ అజయ్ కుమార్, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్డీవో వాసు చంద్ర, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డిలు, తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-05-12 at 18.42.14_9adfd35e

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే జారే మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే జారే
లోకల్ గైడ్ అశ్వారావుపేట : ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మున్సిపాలిటీ...
హత్యా కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు
ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకల సౌకర్యం తో జనరల్ ఆసుపత్రి ప్రారంభం
ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి సీతక్క, ట్రై కార్ చైర్మన్ బేల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఎస్ టి ఎమ్మెల్యేల సమావేశం పార్టీలకు అతీతంగా హాజరైన st mla లు
రేపు పెంజర్ల లో అనంత పద్మనాభుడి కళ్యాణ మహోత్సవం