ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు

ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు

వరంగల్ (లోకల్ గైడ్ ) : హన్మకొండ ఆర్ & బి గెస్ట్ హౌస్ నందు వచ్చే వర్షాకాలం లో   చెరువులు, కుంటలు, కెనాన్లు పరిరక్షణ కోసం  అలాగే వర్షాకాలంలో కురిసే నీటిని చెరువులు కుంటలు నింపుకొని వాటి సంరక్షణ, రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవలసిన చర్యల గురించి ఇరిగేషన్ శాఖ అధికారులతో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. నాయకులు తమ మండల, గ్రామాల్లో చెరువులు, కుంటలు, కాలువల సమస్యలు ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్లగా వారి ముందే ఆయా సమస్యలను ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ  వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో చెరువులు, కుంటలు, కెనాన్లు పరిరక్షణ కోసం అధికారులు బాధ్యతగా తీసుకొని తగు చర్యలు తీసుకోనీ వర్షాకాలం నాటికి రైతులకు ఏ సమస్య లేకుండా చూడాలని అలాగే ఎవరైనా కాలువలను తూములను విధ్వంసం చేసిన, కబ్జా చేసిన  వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని,అలాగే మున్సిపల్ పరిధిలో ఉన్న నాళాలను రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అక్రమాలు పాల్పడుతున్నారని వాటిని పరిరక్షించాలని అధికారులకు  ఎమ్మెల్యే నాగరాజు సూచించారు. ఇరిగేషన్ శాఖ పరిధిలో  ఏమైనా పెండింగ్ సమస్యలు ఉన్న తమ దృష్టి తీసుకొని వస్తే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చించి సమస్యల పరిస్కారం కోసం  కృషి చేస్తానని, అధికారులు ఎవరూ అలసత్యం వహించకుండా విధులు నిర్వహించి  రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ  ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈలు, డిఈలు, ఏఈలతో పాటు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే జారే మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎంపీ రామసహాయం ఎమ్మెల్యే జారే
లోకల్ గైడ్ అశ్వారావుపేట : ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మున్సిపాలిటీ...
హత్యా కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు
ప్రభుత్వ ఆసుపత్రిలో 300 పడకల సౌకర్యం తో జనరల్ ఆసుపత్రి ప్రారంభం
ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో మంత్రి సీతక్క, ట్రై కార్ చైర్మన్ బేల్లయ్య నాయక్ ఆధ్వర్యంలో ఎస్ టి ఎమ్మెల్యేల సమావేశం పార్టీలకు అతీతంగా హాజరైన st mla లు
రేపు పెంజర్ల లో అనంత పద్మనాభుడి కళ్యాణ మహోత్సవం